Russian Military jet: ఉక్రెయిన్ సరిహద్దులో కుప్పకూలిన రష్యా సైనిక విమానం.. 65 మంది యుద్ద ఖైదీలతో సహా 74 మంది మృతి
ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది కూడా ఉన్నారని రియా నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.

Russian Military jet: ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది కూడా ఉన్నారని , మొత్తం 74 మంది మరణించారని నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.
ఖైదీలను తరలిస్తుండగా..(Russian Military jet)
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల సమయంలో 74 మందితో ప్రయాణిస్తున్న IL-76 కార్గో విమానం కూలిపోయిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖైదీలను మార్పిడి కోసం బెల్గోరోడ్ ప్రాంతానికి తరలిస్తున్నట్లుమంత్రిత్వ శాఖ తెలిపింది. Il-76 అనేది దళాలు, కార్గో, సైనిక పరికరాలు, ఆయుధాలను ఎయిర్‌లిఫ్ట్ చేయడానికి రూపొందించబడిన సైనిక రవాణా విమానం. దీనిలో 90 మంది ప్రయాణీకుల వరకు ప్రయాణించవచ్చు. స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలోని కొరోచన్స్కీ జిల్లాలో ఈ ప్రమాదం జరిగిందని తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. పరిశోధకులు, అత్యవసర సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న బెల్గోరోడ్ ప్రాంతం, ఇటీవలి నెలల్లో ఉక్రెయిన్ నుండి తరచుగా దాడులకు గురవుతోంది. డిసెంబరులో జరిగిన క్షిపణి దాడిలో 25 మంది మరణించారు.
ఇవి కూడా చదవండి:
- Boat Capsizes: గుజరాత్‌లోని వడోదరలో సరస్సులో పడవ బోల్తా పడి 11 మంది మృతి
- DNA Test for Dogs: ఉత్తర ఇటలీ ప్రావిన్స్ లో పెంపుడు కుక్కలకు డీఎన్ఏ పరీక్షలు.. దేనికో తెలుసా?