Home / Ukraine
President Biden to provide $725 million weapons aid package for Ukraine: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుధ్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మొదలైన వార్ ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థతి కనిపించడం లేదు. అయితే తాజాగా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు మరిన్ని ఆయుధాలు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే మరికొన్ని రోజుల్లో తన పదవీ కాలం ముగింపు దశలో ఉన్నందున పలు […]
రష్యా సరిహద్దులోని బెల్గోరోడ్ అనే నగరంలో ఒక అపార్ట్మెంట్ భవనంలో కొంత భాగం కూలి 13 మంది మరణించగా 20 మంది గాయపడ్డారు. భవనం విధ్వంసానికి ఉక్రెయిన్ బాంబుదాడులే కారణమని రష్యా అధికారులు ఆరోపించారు. ఆన్లైన్లో ప్రసారం అవుతున్న వీడియోలు, రెస్క్యూ టీమ్‌లు ప్రాణాలతో బయటపడిన వారి కోసం శిధిలాల గుండా వెతుకుతూవెళుతున్నట్లు చూపిస్తున్నాయి.
రష్యాతో యుద్ధానికి 100,000 మోర్టార్ షెల్స్‌ను కొనుగోలు చేసేందుకు కేటాయించిన దాదాపు 40 మిలియన్ డాలర్లను పక్కదారిపట్టించడానికి ఉక్రెయిన్ ఆయుధ సంస్థ ఉద్యోగులు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి కుట్ర పన్నారని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ తెలిపింది.
ఉక్రెయిన్ సరిహద్దులోని దక్షిణ బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక రవాణా విమానం కూలిపోవడంతో 65 మంది ఉక్రెయిన్ ఖైదీలు మరణించారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా మరో తొమ్మిది మంది కూడా ఉన్నారని రియా నోవోస్టి వార్తా సంస్థ తెలిపింది.
తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా నియంత్రణలో ఉన్న డొనెట్స్క్ నగరంపై ఉక్రేనియన్ దళాలు కాల్పులకు దిగడంతో 27 మంది మరణించగా 25 మంది గాయపడ్డారు. డొనెట్స్క్ ప్రాంతానికి రష్యా నియమించిన అధిపతి డెనిస్ పుషిలిన్ ఈ విషయాన్ని తెలిపారు.
ఉక్రెయిన్ పై రష్యా 122 క్షిపణులు మరియు 36 డ్రోన్ల తో భారీ ఎత్తున వైమానిక దాడులకు దిగింది. 22 నెలల యుద్ధంలో శుక్రవారం జరిగినది అతిపెద్ద వైమానిక దాడిగా పేర్కొంటున్నారు. ఈ దాడుల్లో సుమారు కనీసం 20 మంది పౌరులు మరణించారు. ఉక్రెయిన్ వైమానిక దళం 87 క్షిపణులు, 27 డ్రోన్లను అడ్డగించిందని ఉక్రెయిన్ మిలిటరీ చీఫ్ వాలెరి జలుజ్నీ చెప్పారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా చేసిన రాకెట్ దాడిలో 49 మంది మరణించారు. మృతుల్లో ఆరేళ్ల బాలుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది
జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ ఉక్రెయిన్‌కు 400 మిలియన్ యూరోల సహాయ ప్యాకేజీని ప్రకటించారు. మేము రక్షణ వాహనాలు మరియు మందుపాతర తొలగింపు వ్యవస్థలకు సహాయం చేస్తాము. రాబోయే శీతాకాలం గురించి కూడా మేము జాగ్రత్త తీసుకున్నాము: మేము బట్టలు, విద్యుత్ మరియు వేడి జనరేటర్లను పంపుతాము. ప్యాకేజీ విలువ 400 మిలియన్ యూరోలు అని స్పష్టం చేసారు.
బుధవారం తూర్పు ఉక్రెయిన్‌లోని బహిరంగ మార్కెట్లో రష్యన్ క్షిపణి దాడిచేయడంలో 17 మంది మరణించగా 32మంది గాయపడ్డారు.18 నెలల యుద్ధంలో పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన బాంబు దాడుల్లో ఇది ఒకటి. ఇది పౌరప్రాంతం అని సమీపంలో సైనిక విభాగాలు ఏమీ లేవని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు.
నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.