Last Updated:

Boat Capsizes: గుజరాత్‌లోని వడోదరలో సరస్సులో పడవ బోల్తా పడి 11 మంది మృతి

గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఘటన జరిగినప్పుడు పడవలో 23 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుండి ఐదుగురు పిల్లలను రక్షించింది.

Boat Capsizes: గుజరాత్‌లోని వడోదరలో సరస్సులో పడవ బోల్తా పడి 11 మంది మృతి

Boat Capsizes: గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో గురువారం పడవ బోల్తా పడటంతో తొమ్మిది మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. ఘటన జరిగినప్పుడు పడవలో 23 మంది పిల్లలు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెస్క్యూ టీమ్ సరస్సు నుండి ఐదుగురు పిల్లలను రక్షించింది.

స్థానికుల సాయం..(Boat Capsizes)

ఘటన జరిగిన హర్ని సరస్సు వద్ద మిగిలిన విద్యార్థుల  ఆచూకీ  కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) మరియు అగ్నిమాపక దళం సిబ్బంది ఇతర ఏజెన్సీలతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారని గుజరాత్ విద్యా శాఖ మంత్రి కుబేర్ దిండోర్ తెలిపారు.అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే స్థానికులు కొంతమంది చిన్నారులను రక్షించారని తెలిపారు. వడోదర చీఫ్ ఫైర్ ఆఫీసర్ బ్రహ్మభట్ తెలిపారు.

ఈ విషాద ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంతాపం తెలిపారు.వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడి చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన అమాయక చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషాద సమయంలో వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భగవంతుడు వారికి ఈ బాధను భరించే శక్తిని ప్రసాదించాలి. ప్రస్తుతం బోటులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయుల రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందించి చికిత్స అందించాలని అధికారులను  ఆదేశించామని సీఎం పటేల్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ X లో పోస్ట్ చేసారు.