Ukrainian attacks Russian Air Bases: రష్యాను కోలుకోలేని దెబ్బ తీసిన ఉక్రెయిన్.. ఏకంగా 40 యుద్ధ విమానాల ధ్వంసం!
Ukraine Attack on Russia Airbases – 40 Russian aircrafts Collapsed: రష్యాను ఉక్రెయిన్ కోలుకోలేని దెబ్బ తీసింది. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కలలో కూడా ఊహించని విధంగా దెబ్బ తీశాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ. మూడో కంటికి కనిపించకుండా గత ఏడాదిన్నర కాలంగా గుట్టు చప్పుడు చేసిన ప్లాన్ ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. రష్యా వైమానికి దళానికి చెందిన సుమారు 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. వరుసగా గత నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఇది అతి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. తాజాగా ఉక్రెయిన్ దెబ్బకు పుతిన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
వరుసగా గత నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదివారం రష్యా భూభాగంలోకి చొచ్చకుపోయి కోలుకోలేని దెబ్బతీసింది ఉక్రెయిన్. వాస్తవానికి ఇస్తాంబుల్‌లో సోమవారం ఇరు దేశాల మద్య కాల్పుల విరమణ చర్చలు జరగాల్సింది. దాని కంటే ముందే జెలెన్ స్కీ పుతిన్‌సేనపై భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డాడు. అయితే ఈ ఆపరేషన్ ప్రారంభించడానికి ముందే రష్యాపై భారీ ఎత్తున దాడులు చేస్తామని ఉక్రెయిన్ హెచ్చరించింది. అయినా రష్యా దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాగా ఆదివారం నాటి ఆపరేషన్ విజయవంతం కావడంతో జెలెన్ స్కీ తమ సైనిక దళాలను ప్రశంసలతో ముంచెత్తాడు. పర్పెక్ట్ టైమింగ్..బ్రిలియంట్ ఆపరేషన్ ..రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోయి దాడులు చేసి రావడం అభినందనీయమన్నారు. మాస్కోకు కోలుకోలేని దెబ్బతీశామని దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన టెలివిజన్‌లో ప్రసంగిస్తూ ఉక్రెయిన్ చర్యను సమర్థించుకున్నారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా దళాలను అభినందించారు. ఈ ఆపరేషన్‌కు గాను సుమారు 117 డ్రోన్లను వినియోగించామని చెప్పారు. ఈ ఆపరేషన్ ప్లానింగ్ చేసి పూర్తి చేయడానికి సుమారు ఏడాదిన్నర ఏళ్ల సమయం పట్టింది. ఖచ్చితమైన ప్లానింగ్‌లో విజయవంతంగా పూర్తి చేశామని జెలెన్ స్కీ జాతీయనుద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. సెక్యూరిటీ సర్వీస్ చీఫ్ వాసిల్ మాలియుక్ నుంచి తనకు పూర్తి సమాచారం అందిందన్నారు. రష్యా మిలిటరీ టార్గెట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామన్నారు. రష్యాపై దాడుల కోసం ప్రయోగించిన ఆయుధాలు అద్భుతంగా పనిచేశాయి. రష్యాకు కోలుకోలే దెబ్బ తగిలిందన్నారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 117 డ్రోన్లను ప్రయోగించామని, 34 శాతం క్రూయిస్ మిస్సైల్స్ అనుకున్న లక్ష్యాన్ని చేధించాయి. రష్యా ఎయిర్‌బేస్‌లను పూర్తిగాధ్వంసం చేశాయని జెలెన్ స్కీ దేశ ప్రజలకు వివరించారు.
రష్యాకు చెందిన మూడు వేర్వేరు టైమ్ జోన్‌లలో దాడులు చేయడం జరిగింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారు దాడి జరిగిన వెంటనే రష్యా నుంచి తప్పుకున్నారు. అందరూ సురక్షితంగా ఉక్రెయిన్‌కు చేరుకున్నారు. వారంతా క్షేమంగా ఉన్నారు. ఈ ఆపరేషన్‌పై తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానన్నారు జెలెన్ స్కీ. ఏడాదిన్నర క్రితం చేసిన ప్లానింగ్ ఇప్పుడు ఫలించింది. రష్యాకు చెందిన 40 వైమానికదళాల యూనిట్లు ధ్వంసం అయ్యాయి. భవిష్యత్తులో కూడా దాడులు యధాతథంగా కొనసాగుతాయన్నారు. ఇటీవలే రష్యాపై పెద్ద ఎత్తున దాడులకు ప్లానింగ్ చేసినట్లు ఉక్రెయిన్‌ను హెచ్చరించింది ఉక్రెయిన్. అయితే అంతకు ముందు రాత్రి అంటే శనివారం రష్యా 500 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. కాగా ప్రతీ వారం రష్యా ఉక్రెయిన్‌పై డ్రోన్ దాడుల సంఖ్యను పెంచడమే తప్ప తగ్గించడం మానేసింది. కాగా రష్యా కాలిబర్ మిస్సైల్స్‌ను నేవీ ద్వారా ప్రయోగించడానికి యత్నిస్తోంది. దీంతో ఉక్రెయిన్ తమను తాము రక్షించడానికి అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను వినియోగించుకుందన్నారు జెలెన్ స్కీ. అయితే తమకు సింగిల్ సెకను కూడా యుద్ధం చేయడం ఇష్టం లేదని జెలెన్ స్కీ చెబుతున్నాడు.
కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఎన్నో సార్లు ఆఫర్ చేసినా..పుతిన్ పెద్దగా పట్టించుకోలేదు. తమపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించడం మొదలుపెట్టాడు. రష్యా యుద్ధం వైపే మొగ్గుతోంది. మార్చి 11 న అమరికాతో కూడా చెప్పించాం. బేషరతుగా కాల్పులు ఒప్పందానికి వస్తామని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదన్నారు జెలెన్ స్కీ. కాగా ఆయన అంతర్జాతీయ సమాజాన్ని రష్యాపై దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చి లేదా ఆంక్షలు విధించి అయినా.. దారికి తీసుకురావాలన్నారు.యావత్ ప్రపంచం రష్యాన్ని యుద్ధాన్ని ఆపాలని నచ్చజెప్పినా.. పెడచెవిన పెట్టి అమాయకులను చంపుతోందని ఆరోపించాడు జెలెన్ స్కీ. కాగా గత ఏడాదిన్నర కాలంగా ప్లానింగ్ చేసిన ఉక్రయిన్ సైనికులు ఆదివారం నాడు ‘ఆపరేషన స్పడైర్ వెబ్’ పేరుతో రష్యాలోపల ప్రవేశించి పలు ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. అయితే త్వరలోనే ఇస్తాంబుల్‌లో రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు ముందే జెలెన్ స్కీ రష్యాకు కోలుకోలేని దెబ్బతీశాడు.
కాగా ఉక్రెయిన్‌పై రష్యా ఫిబ్రవరి 24, 2022న యుద్దం మొదలుపెట్టింది. అయితే గత నాలుగేళ్లలో గతంలో ఎన్నడూలేని విధంగా రష్యా ఎయిర్‌బేస్‌లపై పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. ఈ దాడిలో రష్యాకు చెందిన సుమారు 40 విమానాలను పూర్తిగా ధ్వంసం చేసింది. వాటిలో TU-95 , Tu-22M3 strategic బాంబర్స్‌తో పాటు రష్యాకు చెంది ఏ-50 సర్వెలెన్స్ విమానాలు అంటే నిఘా విమానాలు కూడా దెబ్బతిన్నాయని అమెరికా టీవీ సీఎన్‌ఎన్ వివరించింది. ఉక్రెయన్ దాడిలో రష్యాకు సుమారు 7 బిలయన్ డాలర్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 60వేల కోట్ల వరకు నష్టపర్చింది. 34 శాతం రష్యా క్రూయిస్ మిసైల్స్‌ను తీసుకునే వెళ్లే ఎయిర్‌బేస్‌లను పూర్తిగా ధ్వంసం చేసింది ఉక్రెయిన్.
ఉక్రెయిన్ సరిహద్దు నుంచి సుమారు 4వేల 500 కిలోమీటర్ల దూరంలోని ఇర్కుట్స్క్‌లోని బెలాయా ఎయిర్‌బేస్‌ను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే పశ్చిమ రష్యాలో రజ్యాన్‌లోని ద్యాగిలేవో ఎయిర్‌బేస్.. ఇది ఉక్రెయిన్ నుంచి 520 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాన్ని కూడా ధ్వంసంచేసింది. అలాగే ఆర్కిటిక్ సర్కిల్‌లోని మురుమాన్స్‌లో ఓలేన్యా బేస్‌ను, ఇవానోవో ఎయిన్‌బేస్‌ను కూడా ఉక్రెయిన్ ద్వంసం చేసిందని సీఎన్‌ఎన్ ఒక నివేదికలో వివరించింది. వాస్తవానికి సోమవారం నాడు ఉక్రెయిన్, రష్యాల మధ్య ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరగల్సి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో చర్చలు ముందుకు సాగే అవకాశాలు అనుమానమే. కాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ట్ ట్రంప్ కూడా పుతిన్ వ్యవహార సరళితో విసుగు చెందాడు. శాంతి చర్చల పేరు చెబితే ముఖం చాటేయడంతో పుతిన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలుమార్లు హెచ్చరించాడు.
కాగా పుతిన్ గతంలో టర్కీలో ప్రత్యక్షంగా చర్చలు జరుపుతామని ప్రతిపాదనలు తెచ్చారు. దీనికి జెలెన్ స్కీ అంగీకరించారు. అయితే చివరి నిమిషంలో పుతిన్ డుమ్మా కొట్టాడు. అయితే ఉక్రెయిన్- రష్యాల మధ్య విదేశాంగ శాఖ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయి. బేషరతుగా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో పాటు యుద్ధ ఖైదీల మార్పిడితో పాటు బందీల విడుదల.. చిన్న పిల్లలను విడుదల చేయాలన్న ప్రాతిపాదనలతో చర్చలు జరిగాయి. అయితే రష్యా కొంత మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్ ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయిలో దాడులు చేసే ప్రమాదం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మరి జెలెన్ స్కీ రష్యా దాడులను ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే.