Telusu Kada : గ్రాండ్ గా సిద్దు జొన్నలగడ్డ “తెలుసు కదా” మూవీ పూజా కార్యక్రమం..
టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. “డీజే టిల్లు” సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన సిద్దు, నేహా శర్మకి ఈ హిట్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా వచ్చి

Telusu Kada : టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. “డీజే టిల్లు” సినిమాతో మంచి సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ యంగ్ హీరో. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన సిద్దు, నేహా శర్మకి ఈ హిట్ తో యూత్ లో ఫుల్ ఫాలోయింగ్ పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ చిత్రం.. చిన్న సినిమాగా వచ్చి ఇరు తెలుగు రాష్ట్రాలలో సూపర్ సక్సెస్ అయ్యింది. త్వరలో దీనికి సీక్వెల్ సినిమా టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని స్టార్ట్ చేశాడు ఈ యంగ్ హీరో.
ఇటీవల ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ చేసాడు సిద్ధు. ‘తెలుసు కదా’ అనే టైటిల్ తో సినిమా రానున్నట్లు ఒక గ్లింప్స్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా తాజాగా నేడు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరగగా మూవీ యూనిట్ తో పాటు యంగ్ హీరోలు నాని, నితిన్, ఆది పినిశెట్టి కుడ్డ హాజరయ్యారు. వీరితో పాటు డైరెక్టర్లు హరీష్ శంకర్, బాబీ.. పలువురు సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో సిద్ధూ జొన్నలగడ్డ అయ్యప్ప మాలలో కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Unveiling moments from the grand opening of #TelusuKada today!
First Clap by the Natural Star @NameisNani
Camera Switch On by @dirbobby
1st Shot Directed by @harish2you
Script handover by @actor_nithiin & @AadhiOfficial
Film being Directed by @NeerajaKona &… pic.twitter.com/setsubQcei
— People Media Factory (@peoplemediafcy) October 18, 2023
ఇవి కూడా చదవండి:
- MLA Rajasingh: ఓవైసీకి దమ్ముంటే గోషా మహల్ లో ఎం.ఐ.ఎం అభ్యర్థిని నిలబెట్టాలి.. ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్