Last Updated:

Hi Nanna: హాయ్ నాన్న నుండి మరో సాంగ్ .. విక్రమ్ కొడుకు అదరగొట్టాడుగా ..

న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో

Hi Nanna: హాయ్ నాన్న నుండి మరో సాంగ్ .. విక్రమ్ కొడుకు అదరగొట్టాడుగా ..

Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్‌ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతుంది . ఈ మూవీలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రుతి హాసన్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. నాని 30వ సినిమాగా తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ నేపథ్యంలోనే మూవీ మకర్స్ వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇంకోపక్క నాని.. పాన్ ఇండియా లెవల్లో వరుస ప్రెస్ మీట్లు పెట్టి సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నాడు. ఇక సినిమాలో హైలైట్ గా మారింది.. శృతి హాసన్. ఒక స్పెషల్ సాంగ్ కోసం శృతి, నానితో జత కట్టింది. ఇక ఓడియమ్మ హీట్ అంటూ సాగే ఈ సాంగ్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ జోష్ తో యువతను ఆకట్టుకునేలా సాగింది .

బీచ్ ఒడ్డున ఫుల్ జోష్ తో  పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ సెట్ లో నాని, శృతి లుక్ అదిరిపోయింది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ను చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్, శృతి హాసన్ ఆలపించడం విశేషం.  సాంగ్ లో నాని , శృతి హాసన్ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టేలా ఉన్నారు. ఇక ఈ సాంగ్ గురించి సినిమాకు పనిచేసినవారితో పాటు నాని, శృతి కూడా చెప్పుకొచ్చారు. ఇది పర్ఫెక్ట్ పార్టీ సాంగ్ అని, అందరికి నచ్చుతుందని నాని చెప్పుకొచ్చాడు. ఈ సాంగ్ ను నవంబర్ 28 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సాంగ్ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటి వరకు వచ్చిన హాయ్ నాన్న మూవీ సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను బాగా అలరించాయి . ఇప్పుడు ఈ సాంగ్ కూడా ఆ రేంజ్ లో ఉండబోతున్నట్టు చెపుతున్నారు . దీనితో సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి .మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.