Natural Star Nani: ట్రాన్స్ జెండర్ గా నాని.. దానికోసం అంత పెద్ద రిస్క్.. ?

Natural Star Nani: స్టార్స్ ఊరికే అయిపోరు. సినిమా కోసం ఎంతో కష్టపడితేనే స్టార్స్ గా మారతారు. కథ ప్రకారం ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు హీరోలు. దానికోసం ఎలాంటి పాత్రకైనా ఓకే అనేస్తున్నారు. న్యాచురల్ స్టార్ నాని.. తన న్యాచురల్ నటనతో ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ హీరో నుంచి మాస్ హీరోగా మారడానికి నాని కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే వైలెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రా స్టేట్మెంట్ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో లం** కొడుకు అనే బూతుతో ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం అతనివైపు తిప్పుకొనేలా చేశాడు.
ది ప్యారడైజ్ కథ కాకి జాతికి చెందినదని చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల. కన్నతల్లే కొడుకును ఒక లం** కొడుకు అనిచెప్పడం సెన్సేషన్ సృష్టించింది. ఈ డైలాగ్స్ మాత్రమే కాదు.. నాని లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. రెండు జడలు, ముక్కుకు రెండువైపులా ముక్కెరలను పెట్టుకొని ఎంతో రాక్షసంగా కనిపించాడు. ఇక ఈ రెండు జడల లుక్ గురించి శ్రీకాంత్ ఓదెల ఒక క్లారిటీ కూడా ఇచ్చాడు.
“నాని లుక్ కథకు ఎలా కనెక్ట్ అవుతుందనే ఇప్పుడే చెప్పను. కానీ దీనికి సంబంధించిన ఒక విషయం చెబుతాను. నాని జడల వెనుక నా చిన్నతనం దాగి ఉంది. నా వ్యక్తి జీవితంలోని ఓ భావోద్వేగ అంశం దానికి కనెక్ట్ అయ్యి ఉంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాకు అలాగే జడలు వేసేది. జుట్టు అల్లీ జడలు వేసి స్కూల్‌కి పంపేది. ఐదో తరగతి వరకు స్కూల్‌కి నేను అలాగే వెళ్లేవాడిని. ఆ లుక్‌కి, సినిమా కథకు సంబంధం ఏంటనేది మాత్రం సినిమా చూశాక అర్థమవుతుంది” అని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ లుక్ వెనుక మరో కారణం కూడా ఉందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటంటే.. ది ప్యారడైజ్ లో నాని ట్రాన్స్ జెండర్ గా కనిపించబోతున్నాడట. అందుకే రెండు జడలతో పాటు ముక్కుపుడక కూడా పెట్టుకొని కనిపించాడని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ, ఒకవేళ అదే నిజమైతే కనుక పెద్ద రిస్క్ నే నాని చేస్తున్నాడు.
ఈ మధ్యకాలంలో హీరోలు.. ట్రాన్స్ జెండర్ గా చేయడం మాములుగా మారిపోయింది. ఈ మధ్యనే లైలా సినిమాలో విశ్వక్ కూడా అమ్మాయి లుక్ లో కనిపించాడు. అయితే స్టార్ హీరోగా నాని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఇప్పటికీ నానిపై ట్రోల్స్ వస్తున్నాయి. ఈ పాత్ర అటుఇటు ఏమైనా అయితే ఆ ట్రోల్స్ మరింత పెరుగుతాయి. కథను కనుక ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే మాత్రం ఎవరూ ఈ సినిమాను ఆపలేరు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.