Varun Tej – Lavanya Tripathi Engagement : వైభవంగా వరుణ్ – లావణ్య నిశ్చితార్ధం.. వైరల్ గా మారిన పిక్స్
గత కొంత కాలంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Varun Tej – Lavanya Tripathi Engagement : గత కొంత కాలంగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ.. ఎంగేజ్ మెంట్ కూడా ఫిక్స్ అయ్యిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అవతే ఎట్టకేలకు ఈ వార్తల్ని నిజం చేస్తూ అధికారికంగా వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుండగా.. పలువురు ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ లు పెడుతున్నారు.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. వరుణ్ – లావణ్య నిశ్చితార్థానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ తేజ్.. ఇలా మెగా, అల్లు ఫ్యామిలీ హీరోలంతా వచ్చి సందడి చేశారు.
ఈ మేరకు వరుణ్ తేజ్ లావణ్యతో నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి నా లవ్ దొరికింది అంటూ స్పెషల్ గా పోస్ట్ చేశాడు. దీంతో వీరి నిశ్చితార్థం (Varun Tej – Lavanya Tripathi Engagement) ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక లావణ్య కూడా ఇదే ఫోటోలను పోస్ట్ చేస్తూ 2016 నుంచే వీరి ప్రేమ ఉన్నట్టు తెలిపింది. ఇక పలువురు అభిమానులు, నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
View this post on Instagram
View this post on Instagram
లావణ్య-వరుణ్ జంటగా మిస్టర్ మూవీ చేశారు. దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఈ మూవీ 2017 లో విడుదలైంది. ఆ సినిమా సెట్స్ లోనే వీరికి పరిచయం ఏర్పడింది. మొదట అది స్నేహంగా మారింది. తర్వాత ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో ఒకరిపై మరొకరికి ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’లో మరోసారి వీరిద్దరూ జంటగా నటించారు. అప్పటి నుంచి ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని భావిస్తున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej – Lavanya Tripathi Engagement) సోదరి నిహారికా కొణిదెల వివాహానికి పరిశ్రమ నుంచి అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. ఆ అతిథుల జాబితాలో లావణ్యా త్రిపాఠి కూడా ఉన్న విషయం తెలిసిందే.
ఇక వరుణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న “గాండీవధారి అర్జున” చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ కి జంటగా సాక్షి నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.