Vaishnavi Chaitanya: రేటు పెంచినంత ఈజీ కాదు బేబీ.. హిట్ కొట్టడం

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించింది. వెబ్ స్టోరీస్, వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకొని.. సినిమాల్లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి చెల్లిగా నటించి మెప్పించింది. ఇక బేబీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒక్క సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బేబీ రిలీజ్ అయ్యాకా వైష్ణవిని ఆపడం ఎవరివలన కాలేదు. వరుస పెట్టి సినిమా ఛాన్స్ లు వచ్చాయి. కుర్ర హీరోలందరి సరసన నటించడానికి అమ్మడు ఎప్పుడు రెడీగా ఉంది. అయితే.. ఒక్క సినిమాతో స్టార్ డమ్ ను అందుకున్న బ్యూటీస్ ఇప్పటికీ రెండో హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.
అర్జున్ రెడ్డి షాలిని పాండే, ఉప్పెన కృతి శెట్టి, ఆర్ఎక్స్ 100 పాయల్..ఇలా ఓవర్ నైట్ స్టార్స్ అయినవారు.. వెంట వెంటనే సినిమా ఛాన్స్ లు వచ్చినా కూడా విజయాన్ని మాత్రం అందుకొలిపోయారు. ఇక ఈ లిస్ట్ లో వైష్ణవి కూడా చేరింది. బేబీ సినిమా తరువాత వైష్ణవి.. లవ్ మీ అంటూ ఆసిస్ తో ఒక సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపాయింది.
ఇక వైష్ణవి.. వరుస అవకాశాలు వచ్చే కొద్దీ తన రెమ్యూనరేషన్ పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు కోటి డిమాండ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. ఇకపోతే తాజాగా వైష్ణవి నటించిన జాక్ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు.
టిల్లు స్క్వేర్ తరువాత సిద్దు హీరోగా వచ్చినచిత్రం , అందులో ఒక స్టార్ హీరో సరసన మొదటిసారి వైష్ణవి నటించడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. కానీ, సినిమా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. మిక్స్డ్ టాక్ తోనే జాక్ కుదేలు అయ్యిపోయింది. టిల్లు హ్యాంగోవర్ నుంచి సిద్దు బయటకు రాలేదు. ఒంగోలు గిత్త డిజాస్టర్ నుంచి భాస్కర్ బయటకు వచ్చినట్లు కనిపించడంలేదు. ఇద్దరికీడ్డారు సరిపోయారు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
సీరియస్ రా ఏజెంట్ కథలో సిద్దు సరసాలు ఒకపక్క.. అల్లరి చేష్టలు ఇంకోపక్క అని, అసలు వైష్ణవి చైతన్య సినిమాకు సెట్టే కాలేదని కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్న వైష్ణవికి ఇది కూడా హ్యాండ్ ఇచ్చిందని అంటున్నారు. బ్యాడ్ లక్ బేబీని వదలలేదని చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు అయితే.. రేటు పెంచినంత ఈజీ కాదు బేబీ.. హిట్ కొట్టడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఏమైనా కలక్షన్స్ రాబడుతుందేమో చూడాలి.