Published On:

Best flours for Sugar Patient: షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఉత్తమ పిండి రకాలు

Best flours for Sugar Patient: షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఉత్తమ పిండి రకాలు

Best Flour for Sugar Patients: షుగర్ వ్యాధి అంటేనే ఆమడదూరం పరిగెత్తుతారు. ఆహరపు అలవాట్లు, జీన్స్ ప్రభావంతో కొందరు షుగర్ కు లోనవుతున్నారు.  షుగర్ ఉన్న వాళ్లు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. దీంతోపాటు ఉపయోగకరమైన పొడులను, ఆహారంలో భాగం చేయాలి. అందులో భాగంగా  కొన్ని రకాల పిండిని ఆహారంలో భాగం చేసుకోవాలి. బాదాం పిండి, బార్లీ పిండి షుగర్ వ్యాధి ఉన్నవారికి చాలా ఉపయోగం.

 

షుగర్ ను సరైన విధంగా కంట్రోల్ లో ఉంచకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చక్కెర స్థాయిలు పెరిగినట్లయితే అనారోగ్యానికి గురికావలసి వస్తుంది. అందులో భాగంగా మూత్రపిండాల వ్యాధి, న్యూరోపతి మరియు గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తాయి. అందువల్ల రక్తంలో చెక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం.

 

దైనందిన జీవితంలో ఈ పిండి రకాలను వాడాలని ఆహార నిపుణులు అంటున్నారు

1.బాదాం పిండి

2.బేసెన్ పిండి

3. బార్లీ పిండి

4. ఓట్ పిండి

 

1.బాదాం పిండి

ఇది బాదం పప్పు నుండి వస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఈ పిండిని బేకింగ్ మరియు పాన్‌కేక్‌ల తయారీకి వాడతారు.

 

2. బేసెన్ పిండి

బేసెన్ పిండి భారతీయ వంటశాలలో ప్రసిద్దమైనది. ఇది మితమైన GI కలిగి ఉంటుంది. ఇందులో ఫైబర్ మరియు ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. రక్తంలో చక్కెర ను నివారిస్తుంది. ఇది పాన్‌కేక్‌లు, వడలు మరియు ఫ్లాట్‌బ్రెడ్‌ల తయారీలో ఉపయోగిస్తారు.

 

3. ఓట్ పిండి

ఈ పిండిని గ్రౌండ్ ఓట్స్ నుండి తయారు చేస్తారు. ఇందులో బీటా-గ్లూకాన్‌ కలిగి ఉంటుంది, రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మితమైన GI కలిగి ఉంటుంది. ఈ పిండిని ఇతర పిండితో కలపి వాడుకోవచ్చు.

 

4. బార్లీ పిండి

బార్లీ గింజలు భారతదేశంలో చాలా ప్రసిద్ది. ఈ పిండిని బార్లీ గింజల నుండి తయారు చేస్తారు. ఇందులో తక్కువ GI కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్పైక్‌లను నివారిస్తుంది. ఇన్సులిన్ ను మెరుగుపరుస్తుంది.

 

పైన పేర్కొన్న పిండి రకాలతో మీరు కావలసిన తిను బండారాలను తయారుచేసుకోవచ్చు. ఆహారంలో వీటిని భాగం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: