Last Updated:

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు ఇవే..?

దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దామయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్,  ఓటీటీలో రిలీజ్ కి

Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్‌ సిరీస్‌ల వివరాలు ఇవే..?

Upcoming Releases : దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్,  ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు..

టైగర్‌ 3..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా  సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో “టైగర్ 3” లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక పోతే యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో విలన్ గా చేస్తుండటం విశేషం. దీపావళి సందర్భంగా నవంబరు 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

Katrina Kaif on towel scene in Tiger 3: 'It was a difficult sequence to  shoot' | Bollywood - Hindustan Times

జపాన్‌.. 

కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్‌లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. వైవిధ్యమైన కథలు, పాత్రలతో తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులను చేరువైన కార్తి ఈ మూవీలో దొంగ పాత్రలో కనిపించనున్నారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలు జపాన్‌ ఎలా దొంగిలించాడు? అతడిని పట్టుకునేందుకు పోలీసులు వేసిన ఎత్తుగడలు ఏంటి? ఆన్ తెలియాలంటే నవంబరు 10న థియేటర్లో చూడాల్సిందే.

జిగర్‌ తండా – డబుల్‌ ఎక్స్‌..

రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య కీలక పాత్రల్లో కార్తీక్‌ సుబ్బరాజ్‌ రూపొందిస్తున్న చిత్రం ‘జిగర్‌ తండా డబుల్‌ ఎక్స్‌’. దీపావళి కానుకగా ఈ మూవీ కూడా తమిళ, తెలుగు భాషల్లో నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ది మార్వెల్స్‌..

‘ది మార్వెల్స్‌’.. మార్వెల్‌ సిరీస్ లో భాగంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటి బ్రీ లార్సన్‌ కెప్టెన్‌ మార్వెల్‌ పాత్రలో కనిపించనుంది. ఇమాన్‌ వెల్లని, టోయోనా ప్యారిస్‌, సియో-జున్‌ పార్క్‌, శామ్యూల్‌ ఎల్‌. జాకన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నియా డకోస్టా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా నవంబరు 10న తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌, తమిళ భాషల్లో విడుదల కానుంది.

అలా నిన్ను చేరి..

దినేశ్‌ తేజ్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. హెబ్బా పటేల్‌, పాయల్‌ రాధాకృష్ణ హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రానికి మారేష్‌ శివన్‌ దర్శకుడిగా చేస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు కావాలనుకున్న ఓ యువకుడు తన కలతో ప్రేమించిన అమ్మాయికి చేరువయ్యే క్రమమే ఈ చిత్రం అని తెలుస్తుంది.

దీపావళి..

రాము, వెంకట్‌, దీపన్‌ ప్రధాన పాత్రధారులుగా రా.వెంకట్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం “దీపావళి”. ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరించారు. దీపావళి సందర్భంగా నవంబరు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పండగకు కొత్త డ్రెస్‌ కావాలని అడిగిన మనవడి కోసం.. అప్పటిదాకా పెంచుకుంటున్న మేకను అతడి తాత బేరం పెడతాడు. ఆ మేక చుట్టూ అల్లుకున్న ఓ అందమైన పల్లెటూరి కథ ఈ సినిమా.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్‌ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..

నెట్‌ఫ్లిక్స్‌..

ఇరుగుపట్రు (తమిళం) నవంబరు 6

ఎస్కేపింగ్‌ ట్విన్‌ ఫ్లేమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8

రాబీ విలియమ్స్‌ (వెబ్‌సిరీస్‌) నవంబరు 8

ది కిల్లర్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

అమెజాన్‌ ప్రైమ్‌.. 

రెయిన్‌ బో రిష్టా (ఇంగ్లీష్‌) నవంబరు 7

బీటీస్‌: ఎట్‌ టూ కమ్‌ (కొరియన్‌ మూవీ) నవంబరు 9

పిప్పా (హిందీ) నవంబరు 10

డిస్నీ+హాట్‌స్టార్‌..

ది శాంటాక్లాజ్స్‌(వెబ్‌సిరీస్‌2) నవంబరు 8

విజిలాంటి (కొరియన్‌) నవంబరు 8

లేబుల్‌ (తెలుగు) నవంబరు 10

ఆహా..

ది రోడ్‌ (తమిళం) నవంబరు 10

బుక్‌ మై షో..

ది రాత్‌ ఆఫ్‌ బెక్కీ (హాలీవుడ్‌)నవంబరు 7

యు హర్ట్‌ మై ఫీలింగ్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 7

ది అడల్ట్స్‌ (హాలీవుడ్‌) నవంబరు 10

జీ5..

ఘూమర్‌ (హిందీ) నవంబరు 10