Last Updated:

Prakash Raj: మంచు విష్ణు పనిచేసారా? లేదా? అన్నది ’మా‘ సభ్యులకు తెలుస్తుంది.. ప్రకాష్ రాజ్

’మా‘ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు.

Prakash Raj: మంచు విష్ణు పనిచేసారా? లేదా? అన్నది ’మా‘ సభ్యులకు తెలుస్తుంది.. ప్రకాష్ రాజ్

Tollywood: ’మా‘ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికై ఏడాది మాత్రమే అయిందని, ఆయన పనిచేశారా? లేదా? అనేది సభ్యులకు తెలుస్తుందని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాధ్యత కూడా ఉంటుందన్నారు. 90శాతం పనులు చేశామని ప్రకటించడం వల్ల ఆ పనులు చేసినట్లు కాదని అభిప్రాయపడ్డారు. విష్ణు పదవీకాలంలో ఇంకో సంవత్సరం ఉందని, ‘మా’ కోసం ఏం చేస్తారో చూద్దామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పై ‘ఇంకా సమయం ఉంది. ఆలోచిస్తాను’ అంటూ పేర్కొన్నారు.

ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్ని పురస్కరించుకుని ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చామని ప్రకటించారు. ఏడాది క్రితం జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లు హోరాహోరీగా తలపడగా విష్ణు విజయం సాధించి అధ్యక్షుడయ్యారు.

follow us

సంబంధిత వార్తలు

Most Viewed Articles