Director Venky Kudumula: అదిదా సర్‌ప్రైజ్.. మల్లెపూల డ్రెస్ వెనుక కథ ఇదే

Director Venky Kudumula: డైరెక్టర్ వెంకీ కుడుముల.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, రష్మిక నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఐదేళ్ల తరువాత మరోసారి భీష్మ కాంబో రిపీట్ అయ్యింది.
నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించాడు. అనౌన్స్ మెంట్ అయ్యాకా.. ఏమైందో ఏమో తెలియదు కానీ, రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకొని ఆమె ప్లేస్ లో శ్రీలీల వచ్చింది. ఇప్పటికే నితిన్ సరసన శ్రీలీల ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చేశారు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్, శ్రీలీల.. నితిన్, వెంకీ కుడుముల రెండో హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.
రాబిన్ హుడ్ సినిమా మార్చి 28 న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఐటెంసాంగ్ అదిదా సర్‌ప్రైజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సాంగ్ లో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ తన అందచందాలతో అదరగొట్టింది. జీవీ ప్రకాష్ సంగీతం, అమ్మడి అందాలు, శేఖర్ మాస్టర్ స్టెప్పులు.. అబ్బో యూట్యూబ్ ను ఈ సాంగ్ షేక్ ఆడించింది.
అయితే ఈ సాంగ్ లో కేతిక శర్మ మల్లెపూల డ్రెస్ మాత్రం మరింత ఫేమస్ అయ్యింది. మల్లెపూల టాప్ తో కేతిక మొదటి పోస్టర్ రిలీజ్ అయ్యినప్పుడే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.ఇక సాంగ్ రిలీజ్ అయినా దగ్గరనుంచి రీల్స్ అన్నింటిలో ఇదే మల్లెపూల డ్రెస్ తో అమ్మాయిలు పిచ్చెక్కిస్తున్నారు అసలు ఆ మల్లెపూల టాప్ కథ ఏంటి.. ? అని తాజాగా ప్రెస్ మీట్ లో డైరెక్టర్ వెంకీ కుడుములకు ప్రశ్న ఎదురైంది. దీంతో ఈ మల్లెపూల టాప్ వెనుక ఉన్న కథను చెప్పుకొచ్చాడు.
“కేతిక శర్మ ఇంట్రో చాలా స్పెషల్ గా ఉండాలి.. స్పెషల్ కాస్ట్యూమ్ ఉండాలి అని ఆలోచిస్తుంటే.. కరెక్ట్ గా నేను బాల్కనీలో నిలబడి ఉన్నప్పుడు ఎవరో మల్లెపూలు అమ్ముకుంటూ వెళ్తున్నారు. అప్పుడు అనిపించింది అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుందా.. ? అని. దాని రిజల్టే ఇది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో నితిన్, శ్రీలీల కు మాత్రమే కాకుండా కేతిక శర్మకు కూడా హిట్ దక్కుతుందేమో చూడాలి.