Published On:

Allegations on Hero Nithiin: హీరో నితిన్‌ మోసం చేశాడు.. రూ. 75 లక్షలు తీసుకుని హ్యాండ్‌ ఇచ్చాడు – నిర్మాత సంచలన కామెంట్స్‌

Allegations on Hero Nithiin: హీరో నితిన్‌ మోసం చేశాడు.. రూ. 75 లక్షలు తీసుకుని హ్యాండ్‌ ఇచ్చాడు – నిర్మాత సంచలన కామెంట్స్‌

Producer Satyanarayana Reddy Comments on Hero Nithiin: కొంతకాలంగా హీరో నితిన్‌కి పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. వరుసగా అతడి సినిమాలు డిజాస్టర్‌ అవుతున్నాయి. దీంతో ఓ పెద్ద హిట్‌ కొట్లాలని ఆశగా ఎదురుచూస్తున్న నితిన్‌ వరసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ అవి వర్కౌట్‌ అవ్వడం లేదు. ఓ మంచి కథ, భారీ హిట్‌ కోసం చూస్తున్న నితిన్‌పై తాజాగా ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మరెవరో కాదు బింబిసార డైరెక్టర్‌ వశిష్ట తండ్రి సత్యనారాయణరెడ్డి.

 

డైరెక్టర్ వశిష్ట తండ్రి

తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన నితిన్‌ తనని, తన కొడుకుని మోసం చేశాడని, ఓ సినిమా చేస్తానని రూ. 75 లక్షలు అడ్వాన్స్‌ తీసుకుని హ్యాండ్‌ ఇచ్చాడంటూ అసలు విషయం బయటపెట్టారు. యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాడు. తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. అతడి దర్శకత్వంలో వచ్చిన బింబిసార ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీంతో రెండో చిత్రానికే ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవితోనే సినిమా చేస్తున్నాడు. అయితే డైరెక్టర్‌ అవ్వడానికి ముందు వశిష్ట ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని ఆయన తండ్రి సత్యానారాయణ వెల్లడించారు.

 

రూ. 2 కోట్లు ఖర్చు చేశాం..

“నితిన్‌ ఇష్క సినిమా సయమంలో ఆయన తండ్రి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడు నేను ఆ సినిమా కొని వైజాగ్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేవాను. ఆయనకు ఎప్పుడైన అవసరమంటే డబ్బులు కూడా సాయం చేసేవాడిని. అలా మా మధ్య సన్నిహితం పెరిగింది. అదే టైంలో నా కొడుకు వేణు(వశిష్ట) డైరెక్టర్‌ కావాలనే ఆసక్తితో ఉన్నాడని తెలిసింది. నితిన్నా నాన్న సుధాకర్‌రెడ్డితో ఉన్న చనువుతో నితిన్‌తో సినిమా చేద్దాం, అతడి కోసం కథ రాసుకోమన్నాను. నిర్మాతను కూడా సెట్‌ చేసుకున్నాం. ఆయన నితిన్‌కు రూ. 75 లక్షలు.. సినిమాటోగ్రాఫర్‌గా చోటాకే నాయుడికి రూ. 10 లక్షలు అడ్వాన్స్‌ ఇచ్చారు. అయితే వాళ్లక వశిష్ట రాసిన కథ నచ్చలేదు. వేరేవాళ్ల కథతో మావాడితో డైరెక్షన్‌ చేయిద్దామన్నారు.

 

రేంజ్ పడిపోతుంది అన్నారు..

దీంతో ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌కి అలా రూ. 2 కోట్లు ఖర్చు చేశాం. అప్పుడే నితిన్‌ ‘ఆఆ’ మూవీ రిలీజై భారీ విజయం సాధించింది. దీంతో కొత్త డైరెక్టర్‌తో సినిమా చేస్తే మావాడి రేంజ్‌ పడిపోతుందని ఆయన తండ్రి సుధాకర్‌ నాతో అన్నాడు. వాడికి పెద్ద రేంజ్‌ ఉంది కదా.. అది పడిపోతుందట.. అందుకని తర్వాత చేద్దాం అన్నారు. డబ్బులిచ్చిన నిర్మాతను కూడా పిలిచి సినిమా మాతో చేయడం లేదని చెప్పేశారు. అయితే అప్పుడే నితిన్‌ హీరో పూరీ జగన్నాథ్‌లో ఓ సినిమా చేస్తున్నామని, కావాలంటే దానికి మీరే నిర్మాతగా ఉండండి అని ఆయనతో అన్నారు. అప్పుడా నిర్మాత నేను మీతో పార్ట్‌నర్‌షిప్‌ చేయడానికి రాలేదన్నారు. నా డబ్బు నాకిచ్చేయండి అని తేల్చి చెప్పేశారు. అలా మోసపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేశామని ఆయన చెప్పుకొచ్చారు.