Last Updated:

Robinhood: టాప్ ట్రెండింగ్ లో అదిదా సర్‌‌ప్రైజ్.. రొమాంటిక్ భామ అందాలు అలాంటివి మరీ

Robinhood: టాప్ ట్రెండింగ్ లో అదిదా సర్‌‌ప్రైజ్.. రొమాంటిక్ భామ అందాలు అలాంటివి మరీ

Robinhood: కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టినా.. హిట్ మాత్రం దక్కడం లేదు నితిన్ కి. అయితే ఈసారి మాత్రం పక్కా హిట్ గ్యారెంటీ అంటూ.. రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల  ముందుకు రానున్నాడు. నితిన్, శ్రీలీలజంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం  రాబిన్ హుడ్. .  నితిన్ – వెంకీ కుడుమల కాంబోలో భీష్మ వచ్చింది.

 

నితిన్ కెరీర్ లో ఒక మంచి హిట్ గా భీష్మ నిలిచింది. ఆ సినిమా తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొదట రష్మికనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో రష్మిక తప్పుకోవడంతో ఆ ఛాన్స్ శ్రీలీల కొట్టేసింది. నితిన్, శ్రీలీల కలిసి ఇప్పటికే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.  ఇప్పుడు మరోసారి రాబిన్ హుడ్ కోసం కలిశారు.

 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 28 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరును పెంచేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఈ సినిమా నుంచి రిలీజైన స్పెషల్ సాంగ్ అదిదా సర్‌‌ప్రైజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్యకాలంల హీరోయిన్స్ ఐటెంసాంగ్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది. పుష్ప 2  లో శ్రీలీల  కూడా కిస్సిక్ అంటూ అదరగొట్టింది.

 

ఇక రాబిన్ హుడ్ కోసం రొమాంటిక్ భామ కేతిక శర్మ రంగంలోకి దిగింది. అదిదా సర్‌‌ప్రైజ్ అంటూ సాగే సాంగ్ లో చిన్నది అందాల ఆరబోతతో అదరగొట్టింది. మునుపెన్నడూ లేని విధంగా హీరో లేకుండా ఐటెంసాంగ్ ను డిజైన్ చేశాడు డైరెక్టర్ వెంకీ కుడుమల. చంద్రబోస్ ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా.. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి తమ మెస్మరైజింగ్ వాయిస్ తో అదరగొట్టేశారు.

 

ఈ మధ్యకాలంలో కోలీవుడ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ జీవీ ప్రకాష్ తన సంగీతంతో చార్ట్ బస్టర్ సాంగ్ ను అందించాడు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. శేఖర్ మాస్టర్ స్టెప్స్.. కేతిక శర్మ వేస్తుంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. స్కర్ట్ లాగి.. అదిదా సర్‌‌ప్రైజ్ అంటూ అమ్మడు స్టెప్ వేస్తుంటే.. కుర్రకారు థియేటర్ లో ఆగం అయిపోవడం ఖాయమని చెప్పొచ్చు. కేతిక సాంగ్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం అదిదా సర్‌‌ప్రైజ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.ట్రెండింగ్ నంబర్ 1 గా నిలిచింది. ఈ విషయాన్నీ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.