Last Updated:

Robinhood Interview: ఇదెక్కడి హానెస్ట్ ఇంటర్వ్యూరా మావా.. నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయిపోతుందిగా

Robinhood Interview: ఇదెక్కడి హానెస్ట్ ఇంటర్వ్యూరా మావా.. నవ్వి నవ్వి కడుపు చెక్కలు అయిపోతుందిగా

Robinhood Interview: ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఆ ప్రమోషన్స్ కూడా  ఎంత డిఫరెంట్ గా చేస్తే అంత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తారు. ట్విట్టర్ దగ్గరనుంచి యూట్యూబ్ వరకు అన్నింటిలో కనిపించడం  ఒక ప్రమోషన్. ట్రైన్స్, బస్సు లకు పోస్టర్లు అతికించడం , ప్రాంక్ లు చేయడం, రీల్స్ చేయడం ఇదంతా ఒక ప్రమోషన్.  అయితే ఇవన్నీ పాతవి అయిపోయేమో అనుకున్నాడో ఏమో నితిన్.. హానెస్ట్ ఇంటర్వ్యూకు తెరలేపాడు

 

కుర్ర హీరో నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. భీష్మ లాటి హిట్ సినిమా తరువాత వీరి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన అదిదా సర్ ప్రైజూ సాంగ్ ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమా మార్చి 28 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతుంది.

 

ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కలిసి ఒక హానెస్ట్ పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్నారు. భీష్మ నుంచి వీరిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న ఒక ఈవెంట్ లో నితిన్ ఏకంగా.. వెంకీ, నేను ఈ సినిమా చూసి ప్రేమించుకున్నాం.. కామించుకున్నాం అంటూ తమ మధ్య ఉన్న ఆ ర్యాపో  గురించి చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఈ పాడ్ కాస్ట్ లో చూపించారు. సాధారణంగా సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా అనుమానాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కొన్ని అనుమానాలకు ఎప్పటికీ సమాధానాలు దొరకవు.

 

అలాంటి రేర్ డౌట్స్ కు ఈ పాడ్ కాస్ట్ లో వెంకీ కుడుముల సమాధానాలు చెప్పుకొచ్చాడు. ప్రతి హీరోకు వారి డైరెక్టర్స్ ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంటుంది. వాటి ఆన్సర్స్ నువ్వు నాకు చాలా హానెస్ట్ గా చెప్పాలి అని నితిన్ చెప్పగా.. హానెస్ట్ లో నాకన్నా హానెస్ట్ ఎవరు ఉండరండీ అని వెంకీ చెప్పుకొస్తాడు. చాలా ఫైట్స్ లో హీరో ముందు కొందరిని కొడుతుంటే వెనుక ఉన్న ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్లు కూడా రావచ్చుగా ఒకేసారి అని నితిన్ అడిగిన ప్రశ్నకు వెంకీ మాట్లాడుతూ.. ఒకేసారి వస్తే హీరోకు దెబ్బలు తగులుతాయని మేమే అసిస్టెంట్ డైరెక్టర్స్ ను ఒక్కొక్కరిని పంపమని చెప్తాం అని చెప్పుకొచ్చాడు.

 

ఉదయమే లేచే సీన్ లో హీరో చాలా అందంగా, హెయిర్ కి జెల్ పెట్టి నీట్ గాచూపిస్తారు  ఎందుకు.. ?  అని నితిన్ అడగ్గా, ఇలాంటి డౌట్స్ వస్తాయనే నా హీరోకు రాత్రే మేకప్ వేసి పడుకోబెడతాను. ఉదయం లేచేసరికి చాలా ఫ్రెష్ గా కనిపిస్తాడు అని వెంకీ చెప్పుకొచ్చాడు. సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ నుంచే రావాలా.. ? క్లైమాక్స్ కు శుభం కార్డు ఎందుకు పెట్టడం లేదు.. ? హీరోలు డ్యాన్స్ చేసెటప్పుడు పక్కన ఉండే పూలు అమ్మేవాడు కూడా వచ్చి డ్యాన్స్ ఎలా చేస్తాడు.. ? లాంటి ప్రశ్నలకు వెంకీ తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూ చూసి నెటిజన్స్ పగలబడి నవ్వుకుంటున్నారు. వెంకీ బ్రో కొంచెం గ్యాప్ ఇవ్వు.. ఇంత  హానెస్టీ తట్టుకోలేకపోతున్నామని కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇవి కూడా చదవండి: