Women Commission: అసభ్యకర డ్యాన్స్ స్టెప్పులు, దర్శక-నిర్మాతలకు మహిళా కమిషన్ వార్నింగ్

Telangana Women Commission Serious Dance Choreography: ఇటీవల కాలంలో సినిమా పాటలు ఎంతటి సంచలనంగా సృష్టిస్తున్నాయో.. అదే స్థాయిలో వివాదాల్లోనూ నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటెం, స్పెషల్ సాంగ్స్‌ని వివాదాలు చూట్టుముట్టుతున్నాయి. పాటలు బాగున్నా అందులోని స్టెప్స్ అభ్యంతరకరంగా ఉంటున్నాయంటున్నారు. ఇటీవల డాకు మహారాజ్ చిత్రంలోని ‘దబిడి దిబిడి నీ చేయే ఎత్తు బాల’ పాటకు ఎంతపెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.
అదిదా సర్‌ప్రైజ్‌పై వివాదం
కానీ ఇందులో ఊర్వశీ రౌతేలా, బాలయ్య స్టేప్స్‌పై అభ్యంతరాలు వచ్చాయి. అప్పుట్లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదం అలా ఉండగానే మరో పాటపై కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.నితిన్ రాబిన్ హుడ్ అదిదా సర్‌ప్రైజ్ సర్‌ప్రైజ్ పాట కూడా వివాదంలో నిలిచింది. ఇందులో హీరోయిన్ కేతిక శర్మ వేసిన సిగ్నేచర్ స్టేప్ప్ తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దీని ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ స్టెప్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఈ స్టెప్పుల వివాదంలో తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది.
మహిళలను కించపరిచేలా
తెలుగు సినిమా పాటల్లో డ్యాన్స్ స్టెప్పుల్లో అసభ్యతగా ఎక్కువగా ఉంటుందని సీరియస్ అయ్యింది. మహిళలను కించపరిచేలా, తక్కుడ చేసి చూపిస్తున్నారని, అలాంటి స్టెప్స్‌ని నిలివేయాలని మహిళా కమిషన్ ఆదేశించింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలుగు సినిమాలో పాటలు అసభ్యకర రితీలో ఉంటున్నట్టు ఇటీవల మహిళా కమిషన్ ఫిర్యాదు అందాయి. ఈ నేపథ్యంలో వాటిపై తెలంగాణ మహిళా కమిషన్ రియాక్ట్ అయ్యింది. తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గురువారం తెలుగు సినిమా ఇండస్ట్రీ దర్శక-నిర్మాతలకు హెచ్చరికలు జారీ చేవారు.
ఇది ఆందోళన కలిగిస్తోంది
“సినిమా అనేది సమాజంపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఈ సినిమా మాధ్యమంలో మహిళలను కించపరిచే విధంగా అసభ్యకరమైన అంశాలను చూపిస్తున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ విషయంలో సినీ దర్శక-నిర్మాతలు, కొరియోగ్రాఫర్లతో పాటు సంబంధిత వర్గాలు బాధ్యతయుతంగా వ్యవహరించాలి. మహిళలని తక్కువ చేసి చూపించే స్టెప్పులను వెనక్కు తీసుకోవాలని. వాటిని నిలిపివేయాలి. లేదంటే చర్యలు తప్పువు” అని హెచ్చరించారు. కాగా ఈ రెండు పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందించడం గమనార్హం. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పటికైన శేఖర్ మాస్టర్ తన పద్దతి మార్చుకుంటే బాగుంటుందంటూ కామెంట్స్ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.