LEO Movie : దళపతి విజయ్ ఫ్యాన్స్ కి షాక్.. “లియో” ఆడియో లాంచ్ రద్దు.. ఎందుకంటే ??
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ "లియో". లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, 'మాస్టర్' తర్వాత విజయ్ - లోకేష్ కాంబినేషన్లో
LEO Movie : కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా ఆడియో లాంచ్ ప్లాన్ చేసింది. అయితే ఈ వేడుక కోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్న విజయ్ ఫ్యాన్స్ కి మూవీ టీం ఊహించని షాక్ ఇచ్చింది. ఆడియో ఫంక్షన్ ని రద్దు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా ఊహించని రీతిలో నిర్మాతలు కూడా కన్ఫర్మ్ చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
ఈ మేరకు మూవీ మేకర్స్ ట్విట్టర్ లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ లో.. అంచనాలకు మించి అభిమానుల నుంచి స్పందన రావడం, ఆడియో లాంచ్ పాసుల కోసం విపరీతమైన రిక్వెస్ట్ లు రావడంతో, భద్రత కారణాలు, ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా లియో ఆడియో ఈవెంట్ నువ్వు రద్దు చేస్తున్నామని రాసుకొచ్చారు. ఈ ఫంక్షన్ రద్దు చేయడం వెనుక ఏ రాజకీయ కారణాలు కూడా లేవని వెల్లడించారు.
Considering overflowing passes requests & safety constraints, we have decided not to conduct the Leo Audio Launch.
In respect of the fans’ wishes, we will keep you engaged with frequent updates.
P.S. As many would imagine, this is not due to political pressure or any other…
— Seven Screen Studio (@7screenstudio) September 26, 2023
కానీ ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈవెంట్ రద్దు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా విజయ్ పాలిటిక్స్ లోకి వస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అభిమానులతో సమావేశం అవుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ బరిలోకి దిగడం ఖాయమని చెబుతున్నారు. దాంతో తమిళనాడు సీఎం స్టాలిన్ ఉద్దేశపూర్వకంగానే ‘లియో’ ఆడియో రద్దు అయ్యేలా చేశాడని అంటున్నారు. అదే విధంగా ఉదయనిధి స్టాలిన్ కి చెందిన రెడ్ జాయింట్ సంస్థకు లియో మూవీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇవ్వకపోవడంతోనే ఆడియో లాంచ్ రద్దు అయ్యేలా చేశారనిమారో వాదన వినిపిస్తుంది.