Naxalites surrender : 50 మంది నక్సలైట్ల లొంగుబాటు

Naxalites surrender : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా బీజాపూర్‌లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్, సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇతడిపై రూ.8లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై రూ.60లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మొత్తం 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరు గంగలూరు, బీజాపూర్ జిల్లాలో బాసగూడ పీఎస్‌లో లిమిట్స్ పనిచేస్తున్నారని చెబుతున్నారు. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో 50 మంది లొంగిపోవడం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కగర్ ఆపరేషన్‌ను తెరపైకి తీసుకొచ్చారు. మావోయిస్టు ఏరివేతను కొనసాగించారు. గతేడాదిలో ప్రారంభమైన ‘కగర్’ ఆపరేషన్.. ఒడిస్సా ఎన్‌కౌంటర్‌తో భారీ విజయాన్ని సాధించింది. అటు ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. వేసవి కాలం కావడం, నీటి సమస్య ఉండటంతో మావోయిస్టులను ట్రాక్ చేయడం చాలా ఈజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా దళాల ఎన్‌కౌంటర్లలో వరుసగా 30,20,15 మంది మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోవడం చర్చగా మారింది.