Last Updated:

Vijay 69: దళపతి 69 మూవీ టైటిల్‌ ఫిక్స్‌ – ఆసక్తిగా పెంచుతున్న ఫస్ట్‌లుక్‌ అండ్‌ టైటిల్‌

Vijay 69: దళపతి 69 మూవీ టైటిల్‌ ఫిక్స్‌ – ఆసక్తిగా పెంచుతున్న ఫస్ట్‌లుక్‌ అండ్‌ టైటిల్‌

Thalapathy Vijay 69 Movie Title: కోలీవుడ్ స్టార్‌ హీరో విజయ్‌ ప్రస్తుతం 69వ సినిమా చేస్తున్నాడు. హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రూపొందుతుంది. పూజ హెగ్డే హీరోయిన్‌ కాగా బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌, ప్రకాశ్‌ రాజ్‌, ప్రియమణి, మమితా బైజు, గౌతమ్‌ మీనన్‌ వాసుదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గతేడాది ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ప్రకటన తోనే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ ప్రస్తుతం తన రాజకీయ ఆరంగేట్రంపై ఆసక్తిగా ఉన్నాడు.

దీంతో అతడి సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నాడుని, ఇదే అతడి చివరి మూవీ కూడా కావోచ్చు అనే ప్రచారం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని తన పొలిటికట్‌ కెరీర్‌కి, నటుడిగా సినీరంగానికి మంచి ఫెయిర్‌వెల్‌గా ఉండేలా మూవీ టీం భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఇది పొలిటికల్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా విజయ్‌ అభిమానులతో పాటు సినీ వర్గాలకు కూడా ప్రత్యేకంగా నిలిచింది. దీంతో మూవీపై మంచి బజ్‌ నెలకొంది. అయితే ఇప్పటి వరకు విజయ్‌ 69, దళపతి 69గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మూవీ టైటిల్‌ ప్రకటించడం విశేషం. ఈ సినిమాకు ‘జన నాయగన్‌’ (తెలుగులో జన నాయకుడు) టైటిల్‌ ఫిక్స్‌ చేసి ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. బ్యాగ్రౌండ్‌లో అంతా వైట్‌ డ్రెస్సుల్లో ఉండగా విజయ్‌ వారితో సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ మూవీపై ఆసక్తిని రేకిస్తోంది. ఇది విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సెట్‌ అయ్యే మూవీ అని అభిప్రాయాలు వస్తున్నాయి. మొత్తానికి ఆయన చివరి సినిమా నుంచి అప్‌డేట్‌ రావడంతో అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు.

కాగా విజయ్‌ గత కొంతకాలంగా తన పార్టీ పనులతో బిజీగా ఉన్నాడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఓ పార్టీ పెట్టి దానికి ద్వారా సేవలు అందించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలనుకున్న విజయ్‌ గతేడాది తన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం’ అనే మార్చి.. పోలిటికల్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. దీంతో నెక్ట్స్‌ 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ పోటీ చేయబోతున్నాడనే ప్రచారం గట్టిగా జరుగుతోంది.