Published On:

Telangana Fine Ric : శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Fine Ric : శ్రీమంతులే కాదు.. పేదలు తినాలి : సీఎం రేవంత్‌రెడ్డి

Telangana Fine Ric : రాష్ట్రంలో ఇక నుంచి పేదలు కూడా శ్రీమంతులు తినే బియ్యం తింటారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ పేదలు తెల్ల అన్నం తినాలని కాంగ్రెస్ ప్రభుత్వం 1.90 పైసలకే బియ్యం ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన పథకాన్ని దివంగత ఎన్టీ రామారావు కొనసాగించారని గుర్తుచేశారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ తీసుకొచ్చారని తెలిపారు. పేదలకు ఆహార భద్రత కోసమే ప్రజాపంపిణీ విధానం ఉందన్నారు.

 

 

ఏడు దశాబ్దాల క్రితమే..
ఏడు దశాబ్దాల క్రితమే పీడీఎస్‌ను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని చెప్పారు. దొడ్డు బియ్యాన్ని ఇస్తే చాలామంది తినడం లేదని, మిల్లర్ల మాఫియాలోకి వెళ్తోందని మండిపడ్డారు. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. పేదవాడు ప్రతిరోజూ సన్నబియ్యం తినాలనేదే తమ ఆలోచన అన్నారు. పేదల కోసం సోనియా గాంధీ ఆహారభద్రతా చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. దేశంలో పేదల ఆకలిని తీర్చిన తల్లి సోనియమ్మ అని తెలిపారు. సన్న బియ్యం ఆలోచన గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా అని రేవంత్ ప్రశ్నించారు.

 

 

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు : మంత్రి ఉత్తమ్
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తాము మూడు రంగుల కార్డులను అందిస్తామని తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. 80 శాతానికి పైగా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభమైందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా వేధించిందో అందరికీ తెలుసుని మండిపడ్డారు. ఇప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తమ్ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి: