Last Updated:

Telangana Tet Results : తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు. 

Telangana Tet Results : తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

Telangana Tet Results : తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలను తాజాగా విడుదల చేశారు. ఈ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఈ నెల 15న టెట్ అర్హత పరీక్షను తెలంగాణ విద్యా శాఖ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ టెట్ లో అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుంది. ఈసారి టెట్ ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా విడుదల చేశారు.

సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.పేపర్ 1 పరీక్షకు 2,26,744 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, పేపర్ 2 పరీక్షకు 1,89,963 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టీఈటీ) ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి. కేవలం 12 రోజుల్లో గ్యాప్ లోనే రెండు పరీక్షల ఫలితాలు రిలీజ్ అవుతుండడం గమనార్హం.

టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. పేపర్ 2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు గా నిలుస్తారు. తెలంగాణలో టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ)ని ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

https://tstet2023results.cgg.gov.in/tstet2023pkgr1510.results