Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 01 ఎపిసోడ్ లో కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గా?

టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. నేటి (2022 అక్టోబర్ 1) 1471 ఎపిసోడ్‌ హైలైట్స్ చూద్దాం.

Karthika Deepam: అక్టోబర్ 01 ఎపిసోడ్ లో కార్తీక్ దగ్గర మోనితను ఇరికించిన దుర్గా?

Karthika Deepam Today: నేటి కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్. ‘ఏంటి మోనిత నా మీద అలిగావా, మనం చాలా క్లోజ్ కదా, బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాను. మోనితని కలిసి, ఇక్కడే ఉండి నా పని పూర్తి చేసుకుని వెళ్దాం అని ఇక్కడికి వచ్చాను. కానీ మోనితకి ఇంకా నా మీద కోపం పోలేదు కాబట్టి వెళ్లిపోతున్నా’దుర్గ కార్తీక్‌తో అంటాడు. అక్కడే శివ, వంటలక్క, మోనిత కూడా ఉంటారు. ఎక్కడికి వెళ్తారండి? ఎంత కోపం ఉంటే మాత్రం, మీరు వెళ్ళిపోతారా? పైగా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఆ మాత్రం కోపం తగ్గదా ఏంటీ, మీరు ఇక్కడే ఉండండని కార్తీక్ అంటాడు. ఇక దొరికిందే ఛాన్స్ అనుకుంటూ దుర్గా వంటలక్క ఇంట్లో ఉన్న బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి వెళ్తాడు.

ఇక దీప, దుర్గలు దీప ఇంటి ముందు ఇద్దరూ నిలబడి ఈ విధంగా మాట్లాడుకుంటారు.‘దీపమ్మా, నువ్వు వంట చేసుకుని వచ్చేయ్. నేను మోనిత దగ్గరకు వెళ్తున్నానని చెప్పి, దుర్గా బ్యాగ్ తీసుకుని వెళ్తాడు. దుర్గా కార్తీక్ దగ్గర మోనితని ఇరికిస్తాడు.‘మోనితా మీ ఫ్రెండ్ వచ్చాడు కదా, తన కోసం స్పెషల్‌గా ఏదైనా వండు అని కార్తీక్ అంటాడు. ‘అమ్మో, మోనిత వంటలు అసలు బాగోవు తినలేం సార్. నాకు ఏడాది పాటు వండి పెట్టింది. తినలేక చచ్చాను బాబోయ్, నీ వంటలు బాగలేదంటే ఇదిగో ఇలానే బుంగమూతి పెట్టేది’ అంటూ లేనివన్ని మోనిత మీద చెప్పేస్తాడు. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ చదవండి : సెప్టెంబర్ 30 ఏపిసోడులో మోనిత జీవితంలోకి అడుగుపెట్టనున్న దుర్గా?

ఇవి కూడా చదవండి: