Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 29 ఎపిసోడ్ లో వాల్తేరు వాణి రంగు బయటపెట్టిన దుర్గ

అంతే కానీ, నీ మీద మోజు పడి కాదు. నాకు ఆడవాసనే అంటేనే పడదు. అందులోనూ నీలాంటి ఆడవాళ్లంటే నాకు ఛీ ఛీ నాకు అసహ్యం’ అని దుర్గ అంటాడు. ‘వదల్రా వదులు’ అంటూ గింజుకుంటుంది వాల్తేరు వాణి.

Karthika Deepam: అక్టోబర్ 29 ఎపిసోడ్ లో వాల్తేరు వాణి రంగు బయటపెట్టిన దుర్గ

Karthika Deepam Today: నేటి కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రెండు సీన్లు హైలెట్. ‘ఎక్కడికి వెళ్తున్నావ్ బంగారం’ అంటూ వాల్తేరు వాణిని గట్టిగా పట్టుకుంటాడు దుర్గ.నా ‘పెట్రోల్ అనుకుని, తెగ గీసేస్తున్నావేంటీ? అవి నీళ్లు’ అంటూ వాల్తేరు వాణికి షాకిస్తాడు. నీ నాటకాలు నా దగ్గర అంటూ వెంటనే వాణి చున్నీ రెండు వైపులా గట్టిగా పట్టుకుని, ‘ఎక్కడికి తప్పించుకుంటావే’అని అంటాడు. వదులు దుర్గా, ఈ వాల్తేరు వాణితో నువ్వు పెట్టుకోవద్దు’ అని కోపంగా వాణి అంటుంది. ‘నువ్వు వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చిందే. నీ మీద, అందుకే నీతో నీతో కొంచెం క్లోజుగా ఉన్నానే. అంతే కానీ, నీ మీద మోజు పడి కాదు. నాకు ఆడవాసనే అంటేనే పడదు. అందులోనూ నీలాంటి ఆడవాళ్లంటే నాకు ఛీ ఛీ నాకు అసహ్యం’అని దుర్గ అంటాడు. ‘వదల్రా వదులు’ అంటూ గింజుకుంటుంది వాల్తేరు వాణి.

‘అమ్మనీ నన్ను కూడా టార్గెట్‌ చేశారా?’ అని దుర్గ అంటాడు. ‘అవును నువ్వు ఆ మోనితని అంతా ఇంతా టార్చర్ పెట్టలేదు కదా అందుకే టార్గెట్ చేశాం. అసలు నిన్ను ఆ రోజే ఇడ్లీలో విషం పెట్టి చంపేద్దాం అనుకున్నా, కానీ అప్పుడే కార్తీక్ రావడంతో బతికిపోయారని వాణి అంటుంది. ఐతే నేను ‘జెస్ట్ మిస్ అన్న మాట. కానీ మిమ్మల్ని మాత్రం మిస్ కానివ్వనే’ అని దుర్గ అంటూ వాణిని మరింత గట్టిగా పట్టుకుంటాడు.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి: