Last Updated:

Karthika Deepam: అక్టోబర్ 07 ఎపిసోడ్ లో సౌర్య గొంతు విన్న దీప

నేటి కార్తీకదీపం సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. సౌర్య గొంతు విన్న దీప, ‘బాగున్నారా అమ్మా, ఆ రోజు మీరు ఏదో హాస్పిటల్ కు వెళ్తుంటే, మిమ్మలని ఆటో ఎక్కించుకున్నాను. గుర్తున్నానా’ అని ఆడగుతాడు.

Karthika Deepam: అక్టోబర్ 07 ఎపిసోడ్ లో సౌర్య గొంతు విన్న దీప

Karthika Deepam Today: నేటి కార్తీకదీపం సీరియల్ ఎపిసోడులో ఈ రెండు సీన్లు హైలెట్. సౌర్య గొంతు విన్న దీప, ‘బాగున్నారా అమ్మా, ఆ రోజు మీరు ఏదో హాస్పిటల్ కు వెళ్తుంటే, మిమ్మలని ఆటో ఎక్కించుకున్నాను. గుర్తున్నానా’ అని ఆడగుతాడు. అప్పుడు దీప ఈ విధంగా ‘హా గుర్తున్నావయ్యా, ఆ రోజు నాకు అక్కడ హాస్పిటల్ లేదని చెప్పి చాలా మేలు చేశావ్’ అంటూ దీప నవ్వుతూ చెబుతుంది. దీప వాళ్ల అన్నయ్యకు కూడా ఇంద్రుడ్ని పరిచయం చేస్తుంది. ఇంతలో సౌర్య, ‘చూశావా పిన్నీ బాబాయ్ చేతులు కడుక్కోవడానికి వెళ్లి ఎవరితోనే పనికిరాని ముచ్చట్లు చెబుతున్నాడంటూ ‘బాబాయ్’ అని పిలుస్తుంది. సౌర్య గొంతు వినగానే వెంటనే దీపకు సౌర్య గుర్తొస్తుంది తిరిగి చూస్తుంది. కానీ అవతలవైపు మొక్కల ఉండటంతో సౌర్య, దీపకు కనిపించదు. ‘వస్తున్నా అమ్మా’ అంటూ ఇంద్రుడు అంటూ అమ్మా ‘మా అమ్మాయి జ్వాల పిలుస్తుందని అనడంతో అప్పుడు దీప, పిలిచింది సౌర్య కాదని తన మనసుకు సర్ది చెప్పుకుంటుంది.

‘చూశావా అమ్మా, ఆ బుడ్డది ఎలా ఎక్కిరిస్తుందో’ అని దీప వాళ్ల అన్నయ్య అనేసరికి, ‘పోనీలో అన్నయ్య చిన్న పిల్ల అంటున్నావ్ కదా. పోనీలే వదిలెయ్. ఇంక వాళ్ల ఆటోని క్రాస్ చేయకు మేమే గెలిచాం వాళ్ళని అనుకోని అన్నయ్య అని అంటుంది దీప. దాంతో ఆటో ముందు వెళ్లిపోతుంది. కారు నెమ్మదిగా వెళ్తుంది. ఇక అప్పటికే మోనిత, ఆ ఊరిలో కారు ఆపమని కార్తీక్కు చెబుతుంది. కార్తీక్ కారు ఆపుతాడు. కార్తీక్, మోనిత ఇద్దరూ కారు దిగి నేత్రదానశిబిరం ఎదురుగా ఉండటంతో కార్తీక్‌కి మొదటి సారి దీపని కలిసిన సీన్ కార్తీక్కు గుర్తొస్తుంది. అవి అన్నీ గుర్తు చేసుకుంటుంటే మోనిత అదంతా గమనించి, కార్తీక్‌ని డైవర్ట్ చేస్తుంది. తరువాత ఏమి జరగనుందో రేపటి ఏపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ చదవండి: అక్టోబర్ 06 ఎపిసోడ్ లో దీప ఇచ్చిన బహుమతికి కార్తీక ఫిదా !