PM Kisan Yojana: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధుల విడుదల ఆ రోజే ?

PM Kisan Yojana: ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులు 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఒకవైపు 20వ విడత జూన్ 20, 2025న విడుదల చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఈరోజు ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు నిరాశతో ఉన్నారు.
19 వాయిదాలు విడుదల..
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద.. ప్రతి విడత దాదాపు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు రైతుల ఖాతాలో జమచేస్తారు. ఇప్పటివరకు మొత్తం 19 వాయిదాలు విడుదల అయ్యాయి. ఈసారి 20వ విడత వంతు వచ్చింది. ఇదిలా ఉంటే.. 17వ విడత గత సంవత్సరం జూన్ నెలలో విడుదలైంది. జూన్ 18న డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. బనారస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ డబ్బును విడుదల చేశారు.
20వ విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు ?
ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద.. ప్రతి విడత దాదాపు నాలుగు నెలల వ్యవధిలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారు. ఉదాహరణకు, 17వ విడత జూన్ 2024లో, 18వ విడత అక్టోబర్ 2024లో, తరువాత 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల చేయబడింది. దీని ప్రకారం.. 20వ విడత జూన్‌లో విడుదల కానుంది. అయితే.. తేదీ గురించి ఇంకా అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. దీని ప్రకారం ఈ నెలలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.