HIT 3 Telugu Trailer: ‘జనాల మధ్య ఉంటే అర్జున్’.. ‘మృగాలు మధ్య ఉంటే సర్కార్’.. ‘హిట్ 3’ ట్రైలర్.. ఊర మాస్

Nani’s HIT 3 Tariler Out: నేచురల్ స్టార్ నాని మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హిట్ 3’ (HIT 3 Trailer). ఇందులో నాని అర్జున్ సర్కార్‌గా పవర్ఫుల్ పోలీసు ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. ముందు నుంచి ఈ సినిమా విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రమిది కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదల ట్రైలర్ మరింత బజ్ పెంచింది.
మే 1న రిలీజ్
త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఇందులో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్‌కు ముహుర్తం పెట్టారు. ఈ రోజు ఉదయం వైజాగ్‌లోని సంగం థియేటర్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన థియేటర్లర్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. ఇక ఆడియన్స్ కోసం యూట్యూబ్‌లో ఉదయం 11.7 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు టీం ప్రకటించింది. చెప్పినట్టుగానే ట్రైలర్‌ను నేడు విడుదల చేసింది.
హిట్ 3 ట్రైలర్ ఎలా ఉందంటే..!
సర్ క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫిట్ సెల్‌లో ఉండాలి.. లేదంటే 6 భూమిలో ఉండాలి అంటూ నాని డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘పాపకి 9 నెలలు సర్ ఏం చేస్తారు సర్ తీసుకువెళ్లి’ అంటూ ఓ మహిళా ఎమోషనల్ డైలాగ్ హత్తుకుంటుంది. ఇక మధ్య మధ్యలో చాగంటి ప్రవచనాలు కూడా యాడ్ చేయడం ట్రైలర్‌కి హైలెట్‌గా నిలిచింది. నిన్ను అర్జున్ అని పిలవాలా? సర్కార్ అని పిలవాలా? హీరోయిన్ అడగ్గా.. ‘జనాల మధ్యలో ఉంటే అర్జున్.. మృగాల మధ్యలో ఉంటే సర్కార్’ అని నాని ఇచ్చిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివరిలో వైట్ సూట్‌లో క్లాసీగా కనిపించిన నాని.. రౌడీ చంపుతూ రక్తం తడిసిన సూట్‌లో ఫుల్ వయెలెన్స్‌తో భయపెట్టాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీ మరిన్ని అంచనాలు పెంచేసింది. టీజర్, ట్రైలర్ ఇంత విశ్వరూపం చూపించిన నాని ఇక థియేటర్లలో ఎలాంటి రచ్చ లేపనున్నాడో చూడాల్సిందే అంటున్నారు ట్రైలర్ చూసినవారంత.
తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ యాక్షన్, వయోలెన్స్‌తో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఇందులో నాని ఫుల్ వయెలెన్స్‌తో క్రూరమైన పోలీసు ఆఫీసర్ గా భయపెట్టాడు. కాగా శైలస్ కోలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాని సరసన కేజీయఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అడివి శేష్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక నాని హోం బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంతి త్రిపురనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.