CM Chandrababu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Tour In Three Districts: సీఎం చంద్రాబాబు నేడ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో నిర్వహించనున్న జీఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ లో పాల్గొననున్నారు. పర్యాటక రంగ అభివృద్ధిపై అధికారులు, పరిశ్రమ ప్రతినిధులతో సీఎం మాట్లాడనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.45 గంటలకు గుంటూరు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజీలో నిర్వహించనున్న ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఏపీ పోలీస్ హ్యాకథాన్ 2025 కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో ఏఐ వినియోగంపై చర్చించనున్నారు.
తర్వాత పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు వెళ్లనున్నారు. జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను పరిశీలించనున్నారు. మున్సిపల్ వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానాలను ఆయన పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5.45 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు పెట్టారు.