SSMB29: కన్ఫాం.. ఎయిర్‌పోర్టులో మహేష్‌తో ‘సలార్’ నటుడు – ఒరిస్సాలో అడుగుపెట్టిన హీరోలు!

Prithviraj sukumaran Confirm in SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోంది. మహేష్ 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇటీవల సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా హైదరాబాద్ శివారులోని ఓ అల్యూమినియ్ ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంది. కొంత బ్రేక్ తర్వాత ఇప్పుడు సెకండ్ షెడ్యూల్‌ని కూడా మొదలుపెట్టేసింది. ఒరిస్సా అడవుల్లో నేటి నుంచి షూటింగ్ జరుపనున్నారు. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు. ఇందులో నిన్న మహేష్ ఒరిస్సా వెళ్లాడు.
బుధవారం ఒరిస్సా వెళుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అక్కడ ఒరిస్సాలో దిగిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కడ మహేష్‌తో పాటు మరో స్టార్ హీరో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, సలార్ ఫేం, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఒరిస్సాలో ఎయిర్‌పోర్టులో దిగాక వారిద్దరు అక్కడ పోలీసు అధికారికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట బయటకు వచ్చాయి. ఇక్కడ మహేష్, పృథ్వీరాజ్ పక్కపక్కనే కనిపించారు. దీంతో కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్స్ నిజమని తేలింది.
Superstar @urstrulyMahesh & @PrithviOfficial !!#SSMB29 #MaheshBabu pic.twitter.com/z8l561tjor
— Mahesh Babu News🦁 (@MaheshBabuNews) March 5, 2025
కొద్దిరోజులుగా SSMB29లో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఫైనల్ కాలేదన్నారు. దీంతో అంతా డైలామాలో పడ్డారు. ఇక రీసెంట్గా దర్శకుడిగా తన సినిమా పనులు పూర్తి చేశానని, ఇక యాక్టర్ తనది కానీ భాషలో లెన్తీ డైలాగ్స్ చెప్పబోతున్నానంటూ ఓ పోస్ట్ చేశాడు. దీంతో అంతా ఇది SSMB29 గురించి అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబుతో కలిసి ఒరిస్సా ఎయిర్‌పోర్టులో కనిపించడంతో ఈ చిత్రంలో ఆయన నటిస్తున్నట్టు కన్ఫాం అయిపోయింది. ఇది తెలిసి వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతన్నారు.
కాగా SSMB29ని జక్కన్న భారీ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మొత్తం అడవులు నేపథ్యంలో సాగనుందట. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇండియా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ నటించనున్నారట. అంతేకాదు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో భాగంగా కాబోతున్నారట. ఇప్పటికే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. రాజమౌళి తండ్రి, సినీ రచయిత కె విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. దుర్గ ఆర్ట్స్ బ్యానర్లో కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహిత ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.