Iran Israel War: ఇరాన్ ఇజ్రాయిల్ గొడవలో అటు ట్రంప్ ఇటు రష్యా.. మధ్యలో అణుబాంబు

Iran Israel War: ఇజ్రాయెల్ ఇరాన్‌కు మధ్య జరుగుతున్న యుద్ధం తీవ్రంగా మారుతుంది. ఇరాన్ అణుబాంబును తయారు చేస్తోందని.. ఆ బాంబు తమపై ప్రయోగించే అవకాశం ఉందని కారణం చెప్పి ఇజ్రాయెల్ టెహరాన్‌పై దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ మరి కొన్ని నెలల్లో అణుబాంబును తయారు చేయబోతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ఇరాన్ అణుబాంబు తయారీ నివారించాలని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహు పెద్దెత్తున ప్రచారం చేస్తున్నారు. దీనికి ట్రంప్ ఆయనకు అండగా నిలిచారు. వెంటనే అణుబాంబు తయారీని నిలిపివేయాలని నెతన్యాహు డిమండ్ చేస్తున్నారు. ఇరాన్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని.. ఇజ్రాయెల్ బతికి బట్టకట్టాలంటే ముందుగా ఇరాన్‌ను అణుబాంబు తయారీని ఆపించాలని నెతన్యాహు డిమాండ్ చేస్తున్నారు. మరి నిజంగానే ఇరాన్ అణుబాంబును దాదాపు పూర్తి చేసే స్థాయికి వచ్చిందా అని తెలియాల్సివుంది.
మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం మొదలై గురువారానికి ఏడో రోజుకు చేరుకుంది. ఏ ఒక్కరు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇక తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్‌పై అత్యంత ప్రమాదకరమైన క్షిపణులతో భారీ ఎత్తున దాడులకు తెగబడింది. వందలాది మిస్సైల్స్‌తో టెల్‌అవీవ్‌పై విరచుకుపడింది. అయితే ఇజ్రాయెల్‌కు చెందిన ఐరన్ డోమ్ ఇరాన్ నుంచి వరదలా వస్తున్న మిస్సైల్స్‌ను అడ్డుకోలేకపోవడంతో భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగింది. వాస్తవానికి ఇజ్రాయెల్ ఎయిర్‌డిఫెన్స్ సిస్టమ్ అత్యంత పటిష్టంగా ఉంటుంది. మరి ఇరాన్ మిస్సైల్స్‌ను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైంది.
అమెరికాకు రష్యా వార్నింగ్
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు రష్యా అధినేత పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ – ఇరాన్ ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోవద్దని ట్రంప్ సర్కార్ ను పుతిన్ హెచ్చరించారు. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా బలగాలు ఇరాన్ పై దాడుల్లో పాల్గొంటాయన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అమెరికాను రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు. అమెరికా జోక్యంతో పశ్చిమాసియాలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు. కాగా అంతకుముందు ఇజ్రాయెల్ – ఇరాన్ ఉద్రిక్తతలను సడలింపచేయడానికి మధ్యవర్తిత్వం వహించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని పుతిన్ అనడం విశేషం.