Puri Rath Yatra 2025: గిరిజనుల దేవుడు ఈ పూరి జగన్నాథుడు.. 56రకాలతో నైవేద్యాలు

Puri Rath Yatra 2025: పూరి క్షేత్రంలో వెలసని జగత్తుకు నాథుడు పూరీ జగన్నాథుడు. ఒకప్పుడు గిరజనులు కొలచిన నీలమేఘశ్వాముడు శ్రీకృష్ణుడు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడగంగాదేవ్ కట్టించడం మొదలుపెట్టాడు. ఆయన మనుమడు రాజా అనంగభీమదేవ్ పాలనలో పూర్తయ్యింది. ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం. జగన్నాథుడు గిరిజనుల దేవుడు. నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడు. అడవిలో ఓ రహస్య ప్రదేశంలో గిరిజనుల రాజైన విశ్వావసుడు జగన్నాథున్ని పూజించేవాడు. విషయం తెలుసుకున్న విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురు లలితను విద్యాపతి ప్రేమించి మనువాడతాడు.
విగ్రహాన్ని చూపించమని ఒకటే వేధించగా అల్లుడి కోరికను నెరవేర్చాలని ఆ సవర రాజు, అతని కళ్లకు బట్ట కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. కుటిల బుద్దితో ఆ విద్యాపతి దారిపొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి బయటపడుతుంది.
వెంటనే ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు విద్యావతి. రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమవుతాయి. దీంతో రాజు నిరాశపడి నిరాహారదీక్ష చేస్తూ అశ్వమేథయాగం చేస్తాడు. ఒకరోజు రాజు నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో… ఏం చేయాలో అని దిక్కుతోచకుండా ఉన్నప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు.
తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని రాజుకు చెడుతాడు. ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదని షరతు పెడతాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. భగవాన్ విశ్వకర్మ మాయం అవుతాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థించగా అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని చెబుతాడు.
అయితే జగన్నాథునికి 56రకాల నైవేధ్యాలను సమర్పిస్తారు. అంటే రోజుకు 8నైవేద్యాలలో 56రకాల వంటలు ఉంటాయి. ఈ ఆలయ వంటశాల భారతదేశంలోనే అతి పెద్ద వంటశాల. గుడి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ వండిన వాటిని మహాలక్ష్మీదేవి పర్యవేక్షిస్తుందని అంటారు. అక్కడ తయారైన నైవేద్యంలో ఏదైనా లోపం ఉంటే కుక్కనీడ వంట శాల దగ్గర కనిపిస్తుందని చెబుతారు. అలాంటప్పుడు ఆ నైవేద్యాన్ని సమాధి చేసి మళ్లీ కొత్తగా చేస్తారట. ఇందుకు మట్టి కుండలను మాత్రమే వాడతారట. నైవేద్యం చేయడానికి రెండు బావులనుంచి మాత్రమే నీళ్లు తీసుకుంటారట. అవి వంటశాలకు ఆనుకుని ఉన్న గంగా, యమున అనే రెండు బావులనుంచి మాత్రమే నీరు తీసుకుంటారట. ఆలయ నియమాల ప్రకారం మధ్యాహ్నం 1గంటకు పెట్టె కోతోభోగ లేదా అబద అనే ప్రసాదం కోసం భక్తులు, స్థానికులు ఎదురుచూస్తూ ఉంటారట. జగన్నాథునికి సమర్పించిన తర్వాత నైవేధ్యాన్ని సింహద్వారానికి ఈశాన్యంలో ఉన్న ఆనంద బజారులో పంచుతారు.
ఛప్పన్ భోగ్ (56 రకాల నైవేద్యాలు)
ఏమిటి? ఒడియా వంటకాల గొప్పతనాన్ని హైలైట్ చేస్తూ, 56 వంటకాల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని పరిశీలిద్దాం:
ఆడ పచ్చడి
అంబా ఖట్టా
అన్నా
అరిష పిత
బటా భాజా
బేసర
చాకులీ పిత
చానా
చేనగజ
చెనపొడ
చూడా భాజా
దహీ బైగానా
దహిబారా
దాల్మా
దహీ పాఖల్
ఎండూరి పిత
గజ
నెయ్యి
ఘీ రైస్
జిలి
కడలి భాజ
కదంబ
కాకర
కనికా
కాంతి
కాంతి భాజ
ఖేచుడి
ఖీరీ
మండ పిఠ
మాల్పువా
మాతా భాజా
మఠ పులి
మిత చాకులి
మితా దాల్
మూల భాజా
నదియా బారా
నదియా చట్నీ
పాఖాలా
పిటా
పిత
పోడా పిత
రసబలి
కుంగిపోండి
సాగ భజ
సజన ఖట్టా
సందేశ్
సారు
సారు భజ
సిఝా కాకర
సిఝా మండ
సుజి కాకర
తడియా ఖీరి
భజ
పఖల
పోడో పిత
ఈ నైవేద్యాలను రోజుకు ఎనిమిది సార్లు దేవతలకు సమర్పిస్తారు. వాటిలో ముఖ్యమైనది ‘మధ్యనా ధూపం’ (మధ్యాహ్న భోజనం) మరియు ‘సంధ్యా ధూపం’ (సాయంత్రం భోజనం). ‘మహాప్రసాద్’ అని పిలువబడే ఈ నైవేద్యాన్ని తినడం వలన భగవంతుని ఆశీర్వాదాలను పొందుతారు.