Last Updated:

Game Changer Hindi Collections: షాకిస్తున్న గేమ్ ఛేంజర్ హిందీ కలెక్షన్స్, అక్కడ టాక్ ఎలా ఉందంటే..

Game Changer Hindi Collections: షాకిస్తున్న గేమ్ ఛేంజర్ హిందీ కలెక్షన్స్, అక్కడ టాక్ ఎలా ఉందంటే..

Game Changer Hindi Collections: సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ మూవీ థియేటర్లోకి వచ్చింది. ఈ పండగ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నిరాశే ఎదురైంది. బాక్సాఫీసు వద్ద గేమ్ ఛేంజర్ కష్టకాలాన్ని ఎదుర్కొంటుంది. రోజురోజుకు వసూళ్లు పెరగాల్సింది తగ్గుతున్నాయి. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ రావడంలో ఆడియన్స్ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే మెల్లిగా మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. అయినప్పటికీ వసూళ్లు మాత్రం పెరగలేదు. ఫస్ట్ డే మూవీ రూ. 186 పైగా కోట్ల గ్రాస్ చేసి భారీ ఓపెనింగ్ ఇచ్చింది.

కానీ రెండో రోజుకు వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. మూడో రోజు మరింత తగ్గాయి. దాంతో మూడు రోజుల్లో గేమ్ ఛేంజర్ సోసో కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఇక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా నార్త్ మంచి టాక్ తెచ్చుకుంది. హిందీలో గేమ్ ఛేంజర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది తాజాగా ప్రముఖ సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘హిందీ సర్క్యూట్స్ లో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ వసూళ్ల విషయంలో ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ థ్రిల్లర్ ఆ పొటెన్షియల్ ని నిలుపుకోలేకపోతుంది. వీకెండ్ అయినా గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ విషయంలో పెద్దగా మార్పు కనిపించలేదు’ అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. అలాగే హిందీ బాక్సాఫీసు వద్ద గేమ్ ఛేంజర్ మూడు రోజుల్లు వసూళ్లను వెల్లడించారు. తొలి రోజు (శుక్రవారం) రూ. 8.84 కోట్లు, రెండో రోజు రూ. 8.43 కోట్లు, మూడో రోజు రూ. 9.52 కోట్టు రాబట్టింది.

ఇలా మొత్తం తొలి వీకెండ్ లో గేమ్ ఛేంజర్ కేవలం రూ. 26.59 కోట్లు మాత్రమే రాబట్టిందని ఆయన పేర్కొన్నారు. ఇది మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ ఇలా ఉంటే సెకండ్ వీక్ గేమ్ ఛేంజర్ రాణించడం కష్టమే అంటున్నారు. కాగా అత్యంత భారీ బడ్జెట్ రూపొందిన ఈ సినిమాలో కేవలం పాటలకు సుమారు రూ. 70 కోట్లకు పైగా ఖర్చు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్ ను గేమ్ ఛేంజర్ కి కెటాయించినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి: