Last Updated:

Ram Charan: సుకుమార్‌ కూతురిని అభినందించిన రామ్‌ చరణ్‌ దంపతులు

Ram Charan: సుకుమార్‌ కూతురిని అభినందించిన రామ్‌ చరణ్‌ దంపతులు

Ram Charan Meets Gandhi Thatha Chettu Team: గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ దంపతులు సుకుమారు కూతురు సుకృతి వేణిని అభినందించారు. ఆమె ప్రధాన పాత్రలో ‘గాంధీ తాత చెట్టు’ సినిమా తెరకెక్కింది. పద్మావతి మాల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిన్న జనవరి 24న థియేటర్‌లో విడుదైలంది. ఈ సందర్భంగా మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మంచి సందేశాత్మక చిత్రం అందించారంటూ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు. ముఖ్యంగా సుకుమార్‌ కూతురు సుకృతి వేణి నటననున కొనియాడుతున్నారు.

దీంతో ఆమె నటనపై సినీ ప్రములు స్పందిస్తూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆయన సతీమణి ఉపాసన కొణిదెల అభినందించారు. తాజాగా గాంధీ తాత చెట్టు మూవీ టీంని రామ్‌ చరణ్‌ కలిశారు. ఈ సందర్భంగా సుకృతికి పూల బోకే ఇచ్చిన కంగ్రాట్స్‌ చెప్పారు. ఆమె మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గాంధీ తాత చెట్టు కత విషయానికి వస్తే నిజామాబాద్‌ జిల్లా అడ్లూర్‌లో జరిగే కథ ఇది.

మహాత్మ గాంధీ గుర్తుగా తన తండ్రితో కలిసి పోలంలో చెట్టు నాటుతాడు రామచంద్రయ్య(ఆనంద చక్రపాణి). తన గుర్తుగా ఆయన జ్ఞాపకంగా ఎప్పుడు ఆ చెట్టు కింద గడుపుతాడు. తరచూ ఈ చెట్టులో తన ప్రాణం ఉందంటూ చెబుతుంటాడు. గాంధీ సిద్దాంతాలను నమ్మే ఆయన.. తన మనవరాలికి గాంధీ(సుకృతి వేణి) అని పేరు పెట్టుకుంటాడు. అంతేకాదు తన మనవాలికి తరచూ గాంధీ సిద్ధాంతాలను బోధిస్తుంటాడు. అలా గాంధీ సిద్ధాంతల అలవరుచుకున్న ఆ చిన్నారి తన తాత కోసం శాంతియుత పోరాటం చేయాల్సి వస్తుంది. అనుకోని పరిస్థితుల్లో రామచంద్రయ్య తన భూమి, చెట్టుకు దూరమయ్యే పరిస్థితి వస్తుంది. దీన తాతకు ఎంతో ఇష్టమైన ఆ చెట్టు కోసం, ఊరీ కోసం గాంధీ ఏం చేసిందనేదే ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి: