Priyanka Chopra: ఆస్తులు అమ్ముకున్న రాజమౌళి హీరోయిన్ .. అంత కష్టం ఏమొచ్చిందో.. ?

Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే అసలు అవసరం లేదు. ఎందుకంటే. SSMB29 లో మహేష్ సరసన నటిస్తున్న బ్యూటీ ఆమె కాబట్టి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసమే ప్రియాంక అమెరికా టూ ముంబై ట్రావెల్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక ముంబైలో తన ఆస్తులను అమ్మడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది.
ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ స్పై అనే సినిమాతో ప్రియాంక చోప్రా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఒకానొక సమయంలో బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ గా ప్రియాంక రికార్డ్ సృష్టించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పీసీ.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహమాడి అమెరికా కోడలుగా మారిపోయింది.
అమెరికా కోడలిగా మారాకా ప్రియాంక.. బాలీవుడ్ ను వదిలి హాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక అప్పుడప్పుడు ముంబై వచ్చిపోయే పీసీ.. మొట్టమొదటిసారి SSMB29 తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె ముంబైలోనే ఉంటుంది.ముంబైలో ఆమెకు నాలుగు ఖరీదైన ప్లాట్ లు ఉన్నాయి. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఆమె పేరు మీద ఉన్న నాలుగు ప్లాట్స్ ను ఒకేసారి విక్రయించింది.
లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోఉన్న 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్ ఉండగా, మరొకటి కాంప్లెక్స్‌లోని 19వ అంతస్తులో ఉంది. ఈ నాలుగు విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లను రూ.16.17 కోట్ల భారీ ధరకు విక్రయించింది. మార్చి 3నే ఆమె ఈ లావాదేవీలను పూర్తి చేసినట్లు సమాచారం.
అయితే ఇంత సడెన్ గా ప్రియాంక ఇన్ని ప్లాట్స్ ను అమ్మడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు తెలియరాలేదు. దీంతో రాజమౌళి హీరోయిన్ కు అంత కష్టం ఏమొచ్చిందో అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.