Published On:

Mohan Lal: ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ ఇంట విషాదం – ఆయన ఇకలేరు

Mohan Lal: ప్రముఖ నటుడు మోహన్‌ లాల్‌ ఇంట విషాదం – ఆయన ఇకలేరు

Mohanlal Uncle Gopinathan Nair Passed Away: మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవసరం లేదు. మలయాళ నటుడైనప్పటికీ ఆయన తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. నేరుగా ఏ సినిమా చేయకపోయిన.. డబ్బింగ్‌ చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. త్వరలో కన్నప్ప చిత్రంలో తెలుగు ఆడియన్స్‌ని పలకరించబోతున్నాడు.

 

ఇక లేటెస్ట్‌గా ఎల్‌ 2: ఎంపురాన్‌, తుడరుమ్‌ వంటి చిత్రాల్లో నటించిన ఆయన ఇంట తాజాగా విషాదం చోటుచేసుకుంది. ఆయనకు ఎంతో ఇష్టమైన ఆయన మేనమామ మంగళవారం కన్నుమూశారు. మోహన్‌ లాల్‌ మేనమామ గోపినాథన్‌ నాయర్‌(93) కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 14 ఏళ్లు వృద్ధాశ్రమంలో ఉంటున్న ఆయన తాజాగా అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో మోహన్‌ లాల్‌ కుటుంబ సభ్‌యులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. గోపనాథన్‌ నాయర్‌ మోహన్‌ లాల్కు స్వయనా మేనమామ. గతంలో అలప్పుజా కో ఆపరేటివ్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేసిన ఆయన రిటైర్మెంట్‌ తర్వాత కొంతకాలం కుటుంబ సభ్యులతో నివసించారు.

 

వయసు మీద పడటంతో 14 ఏళ్లుగా ఆయన వృద్ధాశ్రమంలోనే ఉంటున్నారు. మోహన్‌ లాల్‌ అసలు పేరు రోషన్ లాల్‌. కానీ తన మేనమామ గోపినాథన్‌.. ఆ పేరు కాస్తా మోహన్‌ లాల్‌గా మార్చారు అని ఆయనే స్వయంగా పలు ఇంటర్య్వూలో చెప్పారు. తన మేనమామ అంటే తనకెంతో అభిమానమని, తమ మధ్య మంచి బాండింగ్‌ ఉండేదని గుర్తు చేసుకునేవారు. తాను హీరో అయ్యాక కూడా తన మేనమామతో అంతే అనుబంధాన్ని కొనసాగించారు ఆయన. ఇప్పుడు ఆయన మరణంలో మోహన్‌ లాల్‌ ఇంట విషాదం ఛాయల్‌ నెలకొన్నాయి. ఆయన అంత్యక్రియలు కూడా మోహన్‌ లాల్‌ కుటుంబ సభ్యులు దగ్గరుండి చూసుకోనున్నారు.