Last Updated:

Megastar Chiranjeevi : లిరిక్ రైటర్ చంద్రబోస్ ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..

 “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్  గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడంతో 130 కోట్ల మంది భారతీయులు గర్వించారు.

Megastar Chiranjeevi : లిరిక్ రైటర్ చంద్రబోస్ ను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి..

Megastar Chiranjeevi :  “ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్  గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడంతో 130 కోట్ల మంది భారతీయులు గర్వించారు. ఆస్కార్ అందుకోవాడమే కాకుండా బోనస్ గా వేదికపై ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో.. ఇండియన్ సినిమా చరిత్రలో ఆర్ఆర్ఆర్ ఒక స్పెషల్ ప్లేస్ పొందింది.

ఇక ఆసక్ర అవార్డును అందుకున్న ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డును వేదికపై స్వీకరించారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన వీరిని ప్రముఖులు అభినందిస్తూ సన్మానాలు చేస్తూనే ఉన్నారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆస్కార్ దక్కడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే బష్ లో ఎస్ఎస్ రాజమౌళి, రమా, ఎంఎం కీరవాణి, శ్రీవల్లీ,  ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులను సన్మానించారు. ఇక తాజాగా లిరిసిస్ట్ చంద్రబోస్ ను కూడా చిరు ఘనంగా సన్మానించారు.

ఆస్కార్ వేదికపై తొలి తెలుగు పదాలను వినిపించడం అద్భుతం – చిరంజీవి (Megastar Chiranjeevi)

ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న భోళాశంకర్‌ సెట్‌లోకి చంద్రబోస్ ఆస్కార్ తో అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా చిరు.. చంద్రబోస్‌కి శాలువా కప్పి చిరు సత్కారం చేశాడు. చంద్రబోస్‌ ఆస్కార్‌ని చిరుకి అందించగా గర్వంగా పైకెత్తారు చిరు. ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన చిరంజీవి తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ఆ ట్వీట్ లో 95వ ఆస్కార్ వేదికపై తొలి తెలుగు పదాలను చంద్రబోస్ వినిపించడం ఎంతో అద్భుతమైన అనుభూతి. అందుకు మీకు ధన్యవాదాలు. మీ ద్వారా ఆ క్షణాలను పొందడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా పంచుకున్నారు. చిరు చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న భోళా శంకర్‌ మూవీని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అలానే యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనున్నట్లు తెలుస్తుంది. తమిళ్ లో మంచి హిట్ ఆయన వేదాళం చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది.