Last Updated:

Manchu Vishnu: మళ్లీ ‘కన్నప్ప’ వాయిదా – డిసెంబర్‌లో కాదు.. 2025లోనే, మూవీ రిలీజ్‌పై మంచు విష్ణు క్లారిటీ

Manchu Vishnu: మళ్లీ ‘కన్నప్ప’ వాయిదా – డిసెంబర్‌లో కాదు.. 2025లోనే, మూవీ రిలీజ్‌పై మంచు విష్ణు క్లారిటీ

Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్‌ అండ్‌ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భారీ తారగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు యాక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు. అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ ఈ చిత్రంలో భాగం అవుతున్నారు. ఇక రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, మలయాళ నటుడు మోహన్‌లాల్‌, బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌, కాజల్‌ అగర్వాల్‌తో తదితరలు స్టార్‌ నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో కన్నప్ప చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దానికి తోడు ఈ చిత్రం నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, ప్రచార పోస్టర్స్‌ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు స్వయంగా మూవీ టీం చెప్పిన సంగతి తెలిసిందే. కన్నప్పను డిసెంబర్‌ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామన్నాడు. అయితే తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు విష్ణుకు మూవీ రిలీజ్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. “కన్నప్ప సినిమా కోసమే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఈసంద ఆయన ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాలని కోరుకున్నా” అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం సినిమా రిలీజ్‌ గురించి అడగ్గా.. కన్నప్పను డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని అనుకున్నాము.. కానీ చాలా అనివార్య కారణావాల సమ్మర్‌ 2025కి తీసుకువస్తున్నామన్నాడు. త్వరలోనే మూవీ రిలీజ్‌ డేట్‌పై ప్రకటన కూడా ఇస్తామంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అయితే మొదటి క్రిస్మస్‌కి కన్నప్ప వస్తుందా? రాదా? అనే సందేహాలు ఉన్నాయి ఫ్యాన్స్‌లో. ఎందుకంటే అప్పుడే పుష్ప 2 ఉండటంతో కన్నప్ప రిలీజ్‌ అనేది డైలామాలో ఉంది. ఈ క్రమంలో మంచు కన్నప్ప వాయిదా వేస్తున్నట్టు చెప్పి అభిమానులకు, ప్రేక్షకులకు స్పష్టత ఇచ్చాడు.