Last Updated:

Karthi Sardar Teaser: ఇండియ‌న్ ఇంటెలిజెన్స్ ను భయపెడుతున్న హీరో కార్తీ

హీరో కార్తీ స‌ర్దార్ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో దీపావ‌ళి కానుకగా మన ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Karthi Sardar Teaser: ఇండియ‌న్ ఇంటెలిజెన్స్ ను భయపెడుతున్న హీరో కార్తీ

Tollywood: కోలీవుడ్ హీరో కార్తీ ఇండియ‌న్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ను ఇలా భయపెడుతున్నాడెంటి? మ్యాటర్ చెప్పకుండా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌ గురించి మాట్లాడుతుంటే మీకు డౌట్ వస్తుంది కదా. మీ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఈ కంటెంట్ చివరి వరకు చదవండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌కి, హీరో కార్తీకి మధ్య  లింకేంటి ? అనేది తెలుసుకోవాలంటే మీరు ‘సర్దార్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు ఈ మూవీ మేక‌ర్స్‌. అభిమ‌న్యుడు సినిమా ఫేమ్ మిత్ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కార్తి ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి ఓ కొత్త పాత్ర‌లో మన ముందుకు రబోతున్నారాని తెలుస్తుంది. స్పై అయ్యుండి కూడా ఇండియ‌న్ ఇంటెలిజెన్స్‌ను భ‌య‌పెట్టేలా త‌న పాత్ర ఉందంటే, ఇక ఆ పాత్ర‌ స్టోరిలో ఎన్ని ట్విస్టులు, ఎన్ని ట‌ర్నులను తీసుకోనుందో మనమే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ సినిమాలో కార్తీ ఆరు గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్నారు. ఈ గెట‌ప్స్ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలంటే దీపావ‌ళి వ‌ర‌కు వేచి ఉండాలిసిందే.

స‌ర్దార్ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో దీపావ‌ళి కానుకగా మన ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో, సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్ నిర్మించ‌గా, తెలుగు రాష్ట్రాల్లో నాగార్జున అక్కినేని ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమాకు జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందించగా, ఈ సినిమాకు జి.వి.ప్ర‌కాష్ స్వరాలను అందించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రాశీఖ‌న్నా నటించగా, ఈ సినిమాలో ర‌జీషా విజ‌య‌న్‌, చుంకీ పాండే కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఇవి కూడా చదవండి: