Last Updated:

SSMB29: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్‌ బ్యూటీ! – ఇప్పటికే ప్రీపరేషన్‌ స్టార్ట్‌ చేసిన ప్రియాంక చోప్రా!

SSMB29: మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్‌ బ్యూటీ! – ఇప్పటికే ప్రీపరేషన్‌ స్టార్ట్‌ చేసిన ప్రియాంక చోప్రా!

Mahesh Babu and Rajamouli SSMB29 Latest Update: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ29 (SSMB29) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాపై రాబోతోంది. పాన్‌ వరల్డ్‌గా వస్తున్న ఈ సినిమా దాదాపు అమెజాన్‌ అడవుల్లో యాక్షన్‌ అడ్వేంచర్‌గా రూపొందనుందని ఇప్పటికే జక్కన హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఈ సినిమాలో కొందరు హాలీవుడ్‌ నటీనటులు కూడా నటించే అవకాశం ఉంది. అయితే ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.

గతంలో ఇండోనేషనియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌ అనే ప్రచారం నడిచింది. కియారా అద్వానీ పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు తాజాగా మరో నటి పేరు తెరపైకి వచ్చింది. ఎస్‌ఎస్‌ఎంబీ29లో గ్లోబల్‌ బ్యూటీ నటించనుందని గట్టి ప్రచారం జరుగుతుంది. ఆమె ఎవరో కాదు ప్రియాంక చోప్రా. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో తెరకెక్కునున్న ఈ చిత్రంలో హీరోకి సమానంగా హీరోయిన్‌ పాత్ర ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్‌ కూడా యాక్షన్‌ సీన్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఆ పాత్ర ప్రియాంక చోప్రా పర్పెక్ట్‌ మ్యాచ్‌ అని, ఆమె అయితేనే న్యాయం చేయగలదని జక్కన అండ్‌ టీం అభిప్రాయపడుతుంది.

ఈ మేరకు ప్రియాంక చోప్రా కలిసి కథ, ఆమె పాత్రను వివరించారు. అది ఆమెకు కూడా నచ్చిందని, ఇందులో నటించేందుకు ఆమె ఆసక్తి చూపించారని తెలుస్తోంది. ఇప్పటికే ఎస్‌ఎస్‌ఎంబీ29లో తన పాత్ర కోసం ప్రియాంక ప్రాక్టిస్‌ మొదలు పెట్టిందని, ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. ఇక చ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి సినిమా షూటింగ్‌ మొదలుకానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అటూ ఈ సినిమా కోసం మహేష్‌ బాబు విదేశాల్లో ప్రత్యేక శిక్షణతో పాటు మేకోవర్‌ కూడా అయ్యాడు. లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 లుక్‌కి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మహేష్‌ బాబు హెయిర్‌, గడ్డంతో సరికొత్తగా మెకోవర్‌ అయ్యాడు. ఇదిలా ఉంటే SSMB29ని చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని ఆయన తండ్రి ఈ మూవీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. అమెజాన్‌ అడువుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కునుంది. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌లో కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.