Published On:

Google Pixel 9 Pro Fold: ఎక్కువ డిస్కౌంట్.. గూగుల్ ఫోల్డ్ ఫోన్ ధర పడిపోయింది.. కొద్దిసేపే ఉంటుంది..!

Google Pixel 9 Pro Fold: ఎక్కువ డిస్కౌంట్.. గూగుల్ ఫోల్డ్ ఫోన్ ధర పడిపోయింది.. కొద్దిసేపే ఉంటుంది..!

Google Pixel 9 Pro Fold: భారత్‌లో స్మార్ట్‌ఫోన్స్ వినియోగం విపరీతంగా పెరిగింది. దేశ జనాభాలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. దీంతో చాలా మంది తక్కువ బడ్జెట్‌లో లభించే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే వీరిలో కొందరికి ప్రీమియం ఫోన్స్ వాడాలనే కోరిక ఉంటుంది, కానీ వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో కాస్త వెనుకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి కోసమే ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ అదిరిపేయే శుభవార్త అందించింది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో గూగుల్ ఫోన్‌పై ఉన్న ఆఫర్ల, దాని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

 

Google Pixel 9 Pro Fold Price And Offers
ఈ ఫోన్ ధర గురించి మాట్లాడితే భారతదేశంలో దీని ధర రూ. 1,72,999. దీనిని ఫ్లిప్‌కార్ట్ సేల్ నుండి 11శాతం తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత ఫోన్ రూ. 1,52,999 కు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉటుంది. దీనిలో 16 GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

 

అయితే, దీనితో పాటు రూ. 6,357 నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. అలాగే, మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే మీకు రూ. 63, 700 తగ్గింపు కూడా లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే, మీకు రూ. 4,000 తగ్గింపు పొందుతారు.

 

Google Pixel 9 Pro Fold Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడితే ఇందులో 8-అంగుళాల (2,076×2,152 పిక్సెల్‌లు) LTPO OLED సూపర్ డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 2700 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ బయటి స్క్రీన్ 6.3-అంగుళాల(1,080×2,424 పిక్సెల్‌లు) OLED డిస్‌ప్లే. ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్‌తలో టెన్సర్ G4 చిప్‌సెట్‌లో అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 లో పనిచేస్తుంది.

 

కెమెరా ఫీచర్ల విషయానికొస్తే, దీనికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని మొదటి కెమెరా 48 మెగాపిక్సెల్స్, రెండవది 10.5 మెగాపిక్సెల్స్, మూడవది 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. దీనికి ముందు భాగంలో 10MP డ్యూయల్ కెమెరా ఉంది. కనెక్టివిటీ కోసం వైఫై, బ్లూటూత్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి. పవర్ కోసం, ఇది 4650mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 45-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి: