Rashmika Praises Dhanush: ధనుష్‌పై నేషనల్ క్రష్ రష్మిక ప్రశంసలు.. సెట్‌లో ఏం జరిగిందంటే..?

National Crush Rashmika Mandanna praises Kubera Hero Dhanush: కోలీవుడ్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ అంచనాలతో శుక్రవారం వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. తొలి రోజు నుంచే మంచి పేరు టాక్ సంపాదించుకుంది. తాజాగా, హైదరాబాద్ వేదికగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు హీరో ధనుష్ కూడా హాజరయ్యారు.
అయితే, ఈ సినిమాలో సమీరా పాత్రలో రష్మిక మందన్నా నటించి అందరి మన్ననలు పొందింది. తాజాగా, హీరో ధనుష్‌పై రష్మిక ప్రశంసలు వర్షం కురిపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇందులో హీరో ధనుష్ సింప్లిసిటీని వివరించింది.
‘కుబేర లాంటి పెద్ద సినిమా మీతో చేశా. అయితే ఇద్దరం కలిసి దిగిన ఒక సెల్ఫీ ఫొటో మాత్రమే నా దగ్గర ఉండిపోయింది. మీరు వండర్ ఫుల్ పర్సన్. సెట్స్‌లో నిత్యం కష్టపడి పనిచేశారు. ఇద్దరం మాట్లాడిన ప్రతిసారి ఇతర నగరాల్లో ఉంటున్నాం. మనిద్దరిం ఇతర పనులు చేసుకుంటున్న మాట్లాడేవాళ్లం. రెస్ట్ మనిషికి ఎంత అవసరమో డిస్కస్ చేసేవాళ్లం. అయితే విశ్రాంతి మాత్రం తీసుకోలేదు. కుబేర సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మీరు చాలా ఆదర్శం. మీతో ఉన్న ప్రపంచంతో గౌరవంగా ఉంటారు. సెట్‌లో ప్రత్యేకంగా లడ్డూలు నాకోసం తెచ్చారు. ఇది ఎప్పటికీ గుర్తించుకుంటా. తమిళ భాషల్లో డైలాగ్స్ హెల్ప్ చేశారు. కొన్ని డైలాగ్స్‌కు కొనియాడారు. ఇవన్నీ చాలా చిన్న విషయాలే. కానీ లైఫ్ లాంగ్ గుర్తిండిపోతాయి.’ అని సెల్ఫీ దిగిన ఫోటోను అటాచ్ చేస్తూ ట్వీట్ చేసింది.