Published On:

Pradeep Kondiparthi: సుమను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే.. స్టార్ అయ్యాక ఆమె సంస్కారం..

Pradeep Kondiparthi: సుమను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే.. స్టార్ అయ్యాక ఆమె సంస్కారం..

Pradeep Kondiparthi: ఎఫ్ 2 సినిమా చూసారా.. ? అందులో అంతేగా అంతేగా అని హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ గుర్తుండే ఉంటుంది. ఆయన పేరే ప్రదీప్ కొండపర్తి. నటుడు, దర్శకుడు, నిర్మాత.. మోటివేషనల్ స్పీకర్.. ఇలా చెప్పుకుంటూపోతే ప్రదీప్ గురించి చాలా ఉన్నాయి. టెలివిజన్ రంగంలో కెరీర్ ను ప్రారంభించి.. ఇప్పుడు వెండితెరపై కీలక పాత్రలు చేస్తూ బిజీగా మారాడు.

 

ఇప్పుడు స్టార్స్ గా కొనసాగుతున్న సుమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్, శ్రీనివాస్ రెడ్డి.. వీరందరినీ ప్రదీప్ నే పరిచయం చేశాడు. అయితే వారందరూ ఇంత ఎత్తుకు ఎదిగినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్.. సుమ ఎదుగుదల గురించి చెప్పుకొచ్చాడు. ఆమె ఇంతలా ఎదగడం అనేది తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.

 

” నేను పరిచయం చేసినవాళ్లు ఇప్పుడు స్టార్స్ గా ఉన్నారు. నేనెప్పుడూ కూడా నేనే పరిచయం చేసి గొప్పపని చేశాను అనుకోను. నేనొక డైరెక్షన్ బోర్టులాగా ఒక దారి చూపాను. వెళ్లింది వాళ్లే.. ప్రయాణం చేసింది వాళ్లే. కానీ, నేను వారిలో రైట్ గా ఐడెంటీఫై చేశాను. ఉదాహరణకు సుమ. దూరదర్శన్ లో పెళ్లి చూపులు అనే సీరియల్ చేస్తున్నాను. 13 ఎపిసోడ్ లు 13 మంది హీరోయిన్లు ఉంటారు.

 

మొదటి ఎపిసోడ్ లోనే హీరోకు కలలో బాగా డబ్బున్న అమ్మాయి వస్తుంది. కేవలం రెండు నిమిషాల సీన్. ఆ పాత్ర కోసం ఒక అమ్మాయిని వెతుకుతున్న సమయంలో సుమ తన పేరెంట్స్ తో సహా మా ఇంటికి వచ్చింది.  అప్పుడే ఆ  అమ్మాయి 10 వ తరగతి పాస్ అయ్యింది. సన్నగా పూచిక పుల్లలా ఉన్నా కళ్లు మాత్రం పెద్దగా ఉండడంతో.. ఆ పాత్రకు సుమ కరెక్ట్ అని తీసుకున్నాను.

 

మొదటిరోజు షూట్ లోనే సుమ నన్ను ఇంప్రెస్ చేసింది. డైరెక్టర్ గా  నేను డైలాగ్ చెప్తూ చెప్తూ మధ్యలో చేతిని ముక్కు మీద రుద్దుతూ ఏదో చేశాను. కరెక్ట్ గా సుమ కూడా డైలాగ్ చెప్తూ అలానే చేసింది. ఎందుకు అంటే మీరు చేశారుగా ఇందాకా.. అందుకే అని చెప్పింది. అక్కడే అనుకున్నాను. మంచి నటి అవుతుంది అని. ఆ తరువాత తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అదే సీరియల్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. తరువాత నాతో 6 సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది.

 

సీరియల్స్ చేస్తూనే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తూ యాంకర్ గా మారింది. కొడుకు పుట్టాకా ఒక సీరియల్ చేసింది. ఈరోజుకు కూడా  సుమ సంస్కారం.. ప్రదీప్ సారే నన్ను పరిచయం చేశారు అని చెప్పుకొస్తుంది. స్టార్స్ గా అయ్యాక ఎవరు అలా చెప్పుకోరు. కానీ, సుమ అలా ఎప్పుడు చేయలేదు” అని చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి: