Adipurush : “ఆదిపురుష్” సినిమా హల్లో ఆంజనేయ స్వామి సీటు గురించి సెటైర్లు వేసిన ఆర్జీవి..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన
Adipurush : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం (Adipurush).. మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకొని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా కు వస్తున్న టాక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ ఆశించిన స్థాయిలో విజయం సాధిచకపోవడంతో నిరాశకు లోనైనా అభిమానులు ఈ విజయంతో మళ్ళీ జోష్ నింపుకుంటున్నారు.
ఇక ఈ మూవీ (Adipurush) ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీట్ హనుమంతుడు కోసం కేటాయించాలి అంటూ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని కోరిన సంగతి తెలిసిందే. ఎందుకంటే మన గ్రంధాలలో కావొచ్చు, పూర్వీకులు చెప్పే మాటలు కావొచ్చు.. “రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు” అనే మాటని చెబుతూ ఉంటారు. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్ లో ఇప్పటికే హనుమంతుడు కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించారు.
ఇది ఇలా ఉండగా.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆదిపురుష్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం రిజర్వ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిమాండ్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు సపోర్ట్ చేస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.. అయితే వర్మ ఆంజనేయస్వామికి సీటు అంటే దేవుడిని అవమానించినట్టే అని వెల్లడించారు. మన దేశంలోనే ప్రభాస్ సూపర్ స్టార్ అని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఆదిపురుష్ సినిమాకు ఫ్రీ టికెట్లను ఇవ్వడం ద్వారా తమకు కూడా పాపులారిటీ లభిస్తుందని సెలబ్రిటీలు భావిస్తున్నారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆంజనేయ స్వామికి టికెట్ ను రిజర్వ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం దేవుడిని అవమానించినట్టే అవుతుందని ఆర్జీవీ వెల్లడించారు. హనుమంతునికి థియేటర్ ను సంజీవిని పర్వతంలా ఎత్తుకెళ్లే సత్తా ఉందని, కానీ ఇలా సీటు వేరు చేసి చూడటం ఏంటో అర్థం కావడం లేదు.. ఆంజనేయుడికి సీటును కేటాయించాల్సిన అవసరం అయితే లేదని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు థియేటర్లలో ఆ సీటుకి ప్రత్యేకంగా పూజలు చేయడం పట్ల కూడా పలువురు విమర్శలు చేస్తున్నారు. కేవలం సినిమాని సినిమా (Adipurush) లాగే చూడాలని అతి చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.