Last Updated:

Adipurush Movie : ఆదిపురుష్ లో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. రెండో పాత్రలో కూడా నటించాడుగా !

ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న "ఆదిపురుష్" సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 6000 వేలకు పైగా థియేటర్లలో   సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. మొదటిసారి ప్రభాస్ రాముడిగా నటించిన

Adipurush Movie : ఆదిపురుష్ లో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రభాస్.. రెండో పాత్రలో కూడా నటించాడుగా !

Adipurush Movie : ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న “ఆదిపురుష్” సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. 6000 వేలకు పైగా థియేటర్లలో   సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. రామాయణ కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు. మొదటిసారి ప్రభాస్ రాముడిగా నటించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా చేశారు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్త నిర్మాణంలో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చివరిగా ఎటువంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. థియేట్రికల్ రైట్స్ ద్వారా 270 కోట్ల వరకు, శాటిలైట్ అండ్ ఓటీటీ రైట్స్‌ ద్వారా దాదాపు 210 కోట్ల పైగా వచ్చినట్లు తెలుస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

బాహుబలి తర్వాత మరోసారి ఈ చిత్రంలో ప్రభాస్.. తండ్రి కొడుకులుగా కనిపించాడని తెలుస్తుంది. ఇన్ని రోజులు రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా సినిమాలో మొదటి కొంతసేపు తండ్రిగా దశరథుడు పాత్రలో కూడా కనిపించి అలరించాడు ప్రభాస్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఈ మూవీలో కొన్ని చోట్ల VFX సూపర్ ఉంటే, కొన్ని చోట్ల మాత్రం ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండు అనిపించింది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే మొదటి షో నుంచే ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ రావడాన్ని అందరం గమనించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ అయిన ఈ మూవీకి భారీ వసూళ్లు రావడం పక్కా అని భావిస్తున్నారు.  ఇక ఈ సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. రాముడి, రావణాసురుడి ఎంట్రీ, హనుమాన్ సంజీవనిని తెచ్చే సీన్, లంకాదహనం సీన్స్ గూస్‌బంప్స్ అంటున్నారు. ఇక శబరి మరియు సుగ్రీవుడుతో రాముడు సన్నివేశాలు ఎమోషనల్ గా ఉన్నాయని చెబుతున్నారు.