Jaabilamma Neeku Antha Kopama OTT: ఓటీటీలో ట్విస్ట్ ఇచ్చిన ధనుష్ మూవీ – తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా, స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Jaabilamma Neeku Antha Kopama OTT Telugu Release: స్టార్ హీరో ధనుష్ దర్శకత్వంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘నిలవకు ఎల్ మెల్ ఎన్నాడి కోబం’ (తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా). తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్, కామెడీ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్‌ని బాగా ఆకట్టుకుంటుంది. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
అయితే ఇప్పటికే తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైంలో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్‌ని ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్‌లో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. తమిళ వెర్షన్‌లో అమెజాన్‌లో అందుబాటులోకి రావడంతో ఇక తెలుగు ఓటీటీ రిలీజ్ కూడా త్వరలోనే ఉండబోతుందని అంతా అనుకున్నారు. దీనికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ మూవీ లవర్స్‌కి షాక్ తగిలింది. జాబిలమ్మ నీకు అంత కోపమాను తెలుగు వెర్షన్‌ని సింప్లి సౌత్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ఆ సంస్థ ప్రకటన ఇచ్చింది. అయితే ఈ సంస్థకు తెలుగులో అనుమతి లేదు.
కానీ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడోచ్చు. దీంతో ఇండియన్ ఆడియన్స్ అంతా డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ మరికొద్ది రోజుల్లో అమెజాన్, ఆహా ఓటీటీలోకి రానుందని సమాచారం. కాగా అనిఖా సురేందర్, ప్రియా ప్రకాశ్ వారియర్, పవీష్, మాథ్యూ థామస్, రబియా ఖతూన్, రమ్యా రంగనాథన్, వెంకటేష్ మీనన్‌లు ప్రధాన పాత్రల్లో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కస్తూరి రాజా, విజయలక్ష్మి కస్తూరి రాజా సమర్పణలో ఆర్.కె.ప్రొడక్షన్, వండర్ బాల్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.