Published On:

Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథయాత్ర 2025లో 5 ఆసక్తికరమైన విషయాలు!

Jagannath Rath Yatra 2025: జగన్నాథ రథయాత్ర 2025లో 5 ఆసక్తికరమైన విషయాలు!

Jagannath Rath Yatra 2025: కనులపండులా సాగే యాత్ర, పూరీ జగన్నాథ రథ యాత్ర. ప్రతీ సంవత్సరం ఆషాడ మాసంలో తోడబుట్టిన వారితో వీధులను ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు పరమాత్ముడు.

 

జగన్నాథ రథ యాత్రకు చాలా విశేషం ఉంది. బలరాముడు, సుభద్రలసహితంగా రథాలపై భక్తులను అనుగ్రహించే జగన్నాథుడి గురించి ఇప్పుడు 5 ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం బలరామసుభద్రల సహితంగా శ్రీకృష్ణుడి రథ యాత్ర కన్నులపండుగగా సాగుతుంది. ప్రపంచ నలుమూలలనుంచి ఈ రథయాత్రలో పాల్గొనడానికి భక్తులు ఆశాబమాసంలో పూరికి చేరుకుంటారు. ఇది తొమ్మిది రోజుల పండుగ. ఈ సమయంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలను పూరి జగన్నాథ ఆలయం నుంచి గుండిచ ఆలయానికి కొత్త రథాలపై తీసుకెళతారు. అక్కడే తొమ్మిది రోజులు ఉంచుతారు. ఆతర్వాత పూరి ఆలయానికి తీసుకొస్తారు.

 

రథయాత్ర ఆషాఢ మాసం శుక్ల పక్షంలో రెండవ రోజు లేదా రెండవ తిథిలో ప్రారంభమై శుక్ల పక్షంలో పదవ రోజు లేదా దశమి తిథిలో ముగుస్తుంది. ఈ సంవత్సరం, రథయాత్ర… జూన్ 27న ప్రారంభమవుతుంది, ఆ రోజు పూరి జగన్నాథ ఆలయం నుంచి జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రలను బయటకు తీసుకువెళతారు. ప్రతి సంవత్సరం తయారు చేసే కొత్త రథాలపై బయటకు తీసుకువెళతారు.

 

1. ప్రతి దేవతకు వేర్వేరు రథాలు ఉంటాయి 

ముగ్గురు దేవతలైన, జగన్నాథుడు, బలరాముడు మరియు సోదరి సుభద్ర. ఒక్కొక్కరికి వారి స్వంత రథం ఉంటుంది. జగన్నాథుని రథం పేరు నందిఘోషుడు, బలరాముని రథం పేరు తాళధ్వజుడు, సుభద్రుని రథం పేరు దర్పదలన ఇది పద్మధ్వజాన్ని కలిగి ఉంటుంది.

 

2. రథాల రంగు మరియు డిజైన్ 

ప్రతి రథానికి ఒక నిర్దిష్ట రంగు పథకం మరియు అలంకరణ ఉంటుంది, ఇది దేవత పాత్రను సూచిస్తుంది. జగన్నాథుని రథం పసుపు, ఎరుపు, బలభద్రుని రథం ఆకుపచ్చ, ఎరుపు మరియు సుభద్రది నలుపు మరియు ఎరుపు రంగులలో రథాలను తయారు చేస్తారు. ప్రతీ సంవత్సరం ఇలాగే ఉంటుంది.

 

3. ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు

ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. ఇది మొదటి నంచి వస్తున్న ఆచారం. వాటి పరిమాణం చాలా పెద్దగా ఉంటాయి. రథాలను ప్రతి సంవత్సరం వేప, అంజూర వంటి చెట్ల కలపను ఉపయోగించి కొత్తగా నిర్మిస్తారు. రథానికి మేకులు లేదా ఇనుమును ఉపయోగించుకుండా తయారు చేస్తారు. చెక్క మేకులు, కొబ్బరి తాళ్లు మాత్రమే ఉపయోగించి అద్భుతమైన రథాలను వడ్రంగి తయారు చేస్తారు.

 

4. రథం లాగడం

భక్తులు మందపాటి తాళ్లతో రథాలను లాగుతారు. అలా చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇందులో లక్షలాది మంది పాల్గొంటారు, ఇది దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని కొందరు, మరికొందరు శ్రీకృష్ణునిపై ఉన్న ప్రేమతో మరికొందరు రథాన్ని లాగుతారు.

 

5. నిర్మాణం

తరతరాలుగా వారసత్వంగా పొందిన వంశపారంపర్య వడ్రంగులు రథాలను నిర్మిస్తారు. ఈ విశ్వకర్మలు తమ పూర్వీకులచే వచ్చిన బాధ్యతను ఎంతో శ్రద్దగా చేస్తున్నారు. చెట్లను నరికి నిర్మాణం ప్రారంభించే ముందు కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: