Published On:

Rakul Preet Singh: ‘రామాయణ్‌’ నుంచి ప్రియాంక అవుట్‌! – శుర్పణఖగా రకుల్‌?

Rakul Preet Singh: ‘రామాయణ్‌’ నుంచి ప్రియాంక అవుట్‌! – శుర్పణఖగా రకుల్‌?

Priyanka Was First Choice For Surpanakha in Ramayan Movie: బాలీవుడ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న మూవీ రామాయణ్‌. నితేశ్‌ తివారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా.. నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి సీత లీడ్‌ రోల్లో నటిటస్తున్నారు. ఈ సినిమా గురించి ఇలా ప్రచారం మొదలైందో లేదో.. సైలెంట్‌ షూటింగ్‌ ప్రారంభించారు.

 

ఎలాంటి ప్రకటన లేదు.. నటీనటులు ఎవరనేది కూడా వెల్లడించలేదు. కానీ ఈ సినిమా చకచక షూటింగ్‌ని జరుపుకుంటుంది. ఈ రమాయణ్‌ కాస్ట్‌ గురించి ఆఫిషియల్‌ అప్‌డేట్‌ ఏం లేదు.. కానీ లారా దత్తా, సన్నీ డియోల్‌ వంటి తదితరులు నటిస్తున్నట్టు నెట్టింట ప్రచారం మాత్రమే ఉంది. తాజాగా ఈ సినిమాలో మరో స్టార్‌ హీరోయిన్‌ భాగం కాబోతోంది. ఇందులో శూర్పణఖ పాత్ర కోసం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను మూవీ టీం సంప్రదించిందట. రామాయణ్‌ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావడం కంటే మరో సంతోషం ఏముందని రకుల్‌ వెంటనే ఒకే చెప్పేసిందట.

 

దీంతో ఈ సినిమా రావణుడు చెల్లెలుగా రకుల్‌ ఖారరైంది. నిజానికి ఈ పాత్రం కోసం మొదట గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రాను సంప్రదించారు. మొదట ఒకే చెప్పిన ఆమె.. ఆ తర్వాత డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో ఈ మూవీ చేయలేని టీం చెప్పేసిందట. ప్రియాంక నో చెప్పడంతో మూవీ టీం రకుల్‌ పేరును పరిశీలిస్తూ.. ఆమెను సంప్రదించింది. ఆమెను అడగడంతో వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసిందని టాక్‌. ఈ మేరకు త్వరలోనే రకుల్‌కి లుక్‌ టెస్ట్‌ కూడా నిర్వహించనున్నారట.

 

మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీం ఆఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో రావణుడిగా కేజీయఫ్‌ హీరో, కన్నడ రాక్‌ స్టార్‌ యష్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నటించడమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హనుమంతుడిగా.. సన్నీ డియోల్‌, కైకేయిగా లారా దత్తా నటించనున్నారట. ఈ సినిమా తొలి భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి రెండో భాగాన్ని2017 దీపావళికి రిలీజ్‌ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది.