Published On:

The Raja Saab Teaser: ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌ – వారికి మూవీ టీం వార్నింగ్‌

The Raja Saab Teaser: ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ లీక్‌ – వారికి మూవీ టీం వార్నింగ్‌

The Raja Saab Movie Makers Warns on Teaser Leaked: ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ‘ది రాజాసాబ్‌’ మూవీ ఒకటి. ముందు నుంచి ఈ మూవీపై పెద్దగా బజ్‌ లేదు. కానీ, సినిమా నుంచి విడుదలైన ప్రభాస్‌ లుక్స్‌, వస్తున్న అప్‌డేట్స్‌ హైప్‌ పెంచుతున్నాయి. ముఖ్యంగా రాజావారిగా ప్రభాస్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది హారర్‌, కామెడీ జానర్‌ అని తెలియడంతో అభిమానులంత మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

 

ఎప్పడో మూడేళ్ల క్రితం షూటింగ్‌ మొదలైనా.. ఇంకా షూటింగ్‌ మిగిలే ఉంది. ఇక మూవీ అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మూవీ టీం టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. జూన్‌ 16న టీజర్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీజర్‌ కోసం ఆడియన్స్‌ అంత ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. దీనితోనే ది రాజాసాబ్‌ కంటెంట్‌ ఏంటనేది క్లారిటీ రానుంది. అందుకు ది రాజాసాబ్‌ టీజర్ ఫ్యాన్స్‌కి చాలా ప్రత్యేకం కానుంది. అలాగే ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు టీజర్‌ కటింగ్‌పై డైరెక్టర్‌ స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

 

దీంతో మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ది రాజాసాబ్‌ టీంకు షాక్‌ తగిలింది. టీజర్‌కి సంబంధించిన కీలక క్లిప్స్‌, ఫోటోలు సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. విడుదలకు ముందే టీజర్‌కి సంబందించిన లీక్‌ అవ్వడంతో మూవీ టీం అలర్ట్‌ అయ్యింది. ఈ మేరకు లీకర్స్‌ని హెచ్చరిస్తూ ఓ ప్రకటన చేసింది. “ది రాజాసాబ్‌ లిక్‌ కంటెంట్‌ ఎవరి సోషల్‌ మీడియాలో కనిపించిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఆ సోషల్‌ మీడియా ఖాతాలను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటాం. మీకు మంచి సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడానికి మా టీం క్రషి చేస్తుంది.

 

దీనికి మీరంతా సహాకరించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరు బాధ్యయుతంగా వ్యవహరించండి. జాగ్రత్త” అంటూ హెచ్చరించింది. కాగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది. ఇందులో నిధి అగర్వాల్, మలమాళ బ్యూటీ మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్‌ దత్‌ ప్రతికథానాయకుడిగా కనిపించబోతున్నాడు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.