Published On:

Shanmukha OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆది సాయికుమార్ షణ్ముఖ.. ఎందులో చూడొచ్చు అంటే.. ?

Shanmukha OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆది సాయికుమార్ షణ్ముఖ.. ఎందులో చూడొచ్చు అంటే.. ?

Shanmukha OTT Release: స్టార్ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆది.. ఆ తరువాత అంతటి సక్సెస్ ను అనుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు.

 

విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆదికి మాత్రం స్టార్ గా సక్సెస్ అందడం లేదు. కామెడీ, యాక్షన్, హర్రర్ అంటూ ఏ జోనర్ ను వదలకుండా ఆది తన వంతు ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ మధ్యనే కొద్దిగా డివోషనల్ టచ్ కూడా ఇచ్చాడు.

 

ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా షణ్ముఖం సప్పని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం షణ్ముఖ. మార్చి 21 న రిలీజ్ అయిన ఈ సినిమా అసలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో అనేది కూడా తెలియలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. షణ్ముఖ డిజిటల్ హక్కులను ఆహా సొంతం చేసుకుంది.  ఏప్రిల్ 11 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

 

కొన్ని సినిమాలు థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి విజయాన్నే రాబడతాయి.  ఇక షణ్ముఖ ఒక డివోషనల్ టచ్ తో తెరకెక్కిన సినిమా కావడంతో ఓటీటీలో అభిమానులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని అంటున్నారు మేకర్స్.

 

షణ్ముఖ కథ విషయానికొస్తే..  సిటీలో జరుగుతున్న వరుస అమ్మాయిల హత్య కేసును  చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తో ఉంటుంది క్రిమినాలజీ స్కాలర్  సారా(అవికా గోర్).  తనవలన కాకపోవడంతో తన మాజీ బాయ్ ఫ్రెండ్  పోలీసాఫీసర్ కార్తీ( ఆది సాయి కుమార్) సాయం కోరుతుంది. మొదట ఆ  హత్యలను కార్తీ నమ్మకపోయినా.. ఆ తరువాత సారాకు హెల్ప్ చేయాలనుకుంటాడు.

 

ఇలా ఉండగా ఒక చిన్న పల్లెటూరిలో విగాండా అనే వ్యక్తికీ 6 ముఖాలు కలిగిన ఒక కొడుకు పుడతాడు. అతడిని చూసి జనాలు అసహ్యించుకుంటారు. దీంతో ఎలాగైనా తన కొడుకును మాములు మనిషిని చేయాలని ఆరు రాశుల్లో పుట్టిన అమ్మాయిలను బలి ఇస్తాడు. చివరగా సారాను కూడా బలి ఇవ్వడానికి రెడీ అవుతాడు. చివరికి సారాను కార్తీ కాపాడుకున్నాడా.. ? అసలు విగాండా ఎలా అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు.. ? అనేది సినిమా చూడాల్సిందే. మరి  షణ్ముఖ ఓటీటీలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.