Published On:

Music Director Radhan: సందీప్ రెడ్డి వంగాతో గొడవ.. నా తండ్రే తిట్టాడనుకున్నా

Music Director Radhan: సందీప్ రెడ్డి వంగాతో గొడవ.. నా తండ్రే తిట్టాడనుకున్నా

Music Director Radhan:  విజయ్ దేవరకొండ, షాలిని పాండే  జంటగా  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. టాలీవుడ్  ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగరాసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ నో.. మ్యూజిక్ కూడా అంతే హిట్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాకా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై మండిపడ్డాడు.

 

చాలా ఇంటర్వ్యూస్ లలో అతనిని తిట్టాడు కూడా. అతని వలనే సినిమా ఆలస్యం అయ్యిందని, మ్యూజిక్ సకాలంలో పూర్తిచేయకుండా టార్చర్ పెట్టాడని చెప్పుకొచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు అని, అతని వలన తమకు టైమ్ వేస్ట్ అయ్యిందని కూడా తెలిపాడు. కేవలం సందీప్ రెడ్డి వంగా మాత్రమే కాదు.. చాలామంది దర్శకులు.. రధన్  పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వస్తే కొట్టాలని కూడా చూసారు.

 

ఇక చాలాకాలం తరువాత రధన్ .. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటుచేసిన ఒక ప్రెస్ మీట్ లో రధన్ కు అర్జున్ రెడ్డి మ్యూజిక్ వివాదంపై ప్రశ్న ఎదురయ్యింది. ఇన్నేళ్ల తరువాత రధన్  మొదటిసారి ఈ వివాదంపై నోరు విప్పాడు.

 

“సందీప్ రెడ్డి వంగా నాకు తండ్రితో సమానం. ఆయనే కనుక నాకు అవకాశం ఇవ్వకపోయి ఉంటే అలాంటి మంచి ఆల్బమ్ వచ్చేది కాదు. ఒక సినిమా చేస్తున్నప్పుడు విభేదాలు రావడం సహజం. ఎన్ని అన్నా సందీప్ ను నేనేమి అనలేను. అసలు వాటిని పట్టించుకోని. నా తండ్రి తిట్టడనుకున్నాను. అయితే నాకు బాగా బాధ అనిపించింది ఎక్కడంటే ..  నా మ్యూజిక్ నచ్చకపోయి ఉంటే మొదటి సాంగ్ అయ్యినవెంటనే చెప్పి ఉంటే సినిమా నుంచి నేను తప్పుకొనేవాడిని. కానీ, సినిమా  మొత్తం అయ్యిపోయి, రిలీజ్ అయ్యాకా నా మ్యూజిక్ నచ్చలేదని చెప్పడం నాకు బాధ అనిపించింది.

 

సందీప్ మాటతీరు కొద్దిగా కఠినంగా ఉంటుంది. నాతోనే కాదు అందరితో ఆయన అలానే మాట్లాడతారు. ఆ తరువాత నేను చాలా  డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. ఒక్కొక్కరి మాటతీరు ఒక్కోలా ఉంటుంది. మ్యూజిక్ అందించడమే నా పని. సినిమా కోసం నేను కూడా కష్టపడతాను. చెత్త మ్యూజిక్ అయితే ఇవ్వలేదు కదా.. అర్జున్ రెడ్డి సినిమా విషయంలో నేను సంతృప్తిగా ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు.